Lips Beauty : ప్రతి ఒక్కరు కూడా, అందంగా కనపడాలని అనుకుంటుంటారు. అందంగా కనపడటం కోసం, అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. అయితే, చలికాలం లో స్కిన్ పాడైపోతూ ఉంటుంది. పెదాలు కూడా పగిలిపోతూ ఉంటాయి. పెదవులు పగుళ్ళతో, చాలామంది బాధపడుతూ ఉంటారు. పైగా పెదాలు నల్లగా మారిపోతూ ఉంటాయి. పెదవులు పగిలిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. నిజానికి పెదవులు అందంగా ఉంటే, మనం కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటాం. కెమికల్స్ ఉండే లిప్స్టిక్స్ వంటి వాటిని వాడడం, ఆహారపు అలవాట్లు ధూమపానం, మద్యపానం, వాతావరణ మార్పులు, మృత కణాలు, ఒంట్లో వేడి బాగా పెరిగిపోవడం ఇలా పలు కారణాల వలన, పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. చాలామంది, పెదాలు పగిలిపోతూ ఉంటాయి.
చాలామంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పెదాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పెదాలని గులాబీ రంగులోకి మార్చుకోవాలన్నా, అందంగా మార్చుకోవాలన్నా బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు. ఎక్కువ ధర పెట్టి ప్రొడక్ట్స్ కొనక్కర్లేదు. ఈ ఇంటి చిట్కాలతో ఈజీగా మనం అందమైన పెదాలని సొంతం చేసుకోవచ్చు.
నల్లగా ఉన్న పెదవులు గులాబీ రంగులోకి మృదువుగా మారిపోవాలంటే ఇలా చేయండి. దీని కోసం ముందు ఒక బౌల్ లో మూడు స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోండి. రెండు స్పూన్లు కలబంద గుజ్జు వేసుకుని, బాగా కలిపి, ఐదు నిమిషాలు రెండు కలిసేటట్టు కలపండి. తర్వాత నిమ్మరసం, గ్లిజరిన్ వేసి ఇంకో ఐదు నిమిషాల పాటు కలపండి. ఈ సిరం ని మీరు, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు.
ఈ సిరమ్ ని రోజుకి కనీసం రెండు నుండి మూడు సార్లు పెదాలకు రాస్తూ ఉండండి. ఇలా చేస్తే పెదాలు బాగుంటాయి. నల్లగా ఉన్న పెదవులు ఎంతో మృదువుగా మారిపోతాయి. గులాబీ రంగులోకి వచ్చేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈజీగా చలికాలంలో పెదాలు సమస్య నుండి బయటపడొచ్చు.