Cough : మన వంటింట్లో ఉండే ముఖ్యమైన దినుసుల్లో పసుపు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో ఇది ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంటంది. ఎంతో కాలంగా మనం పసుపును వంటల్లో ఉపయోగిస్తూ ఉన్నాం. పసుపు ఔషధంగా కూడా ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు. పసుపును ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పసుపును వాడడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అన్ని రకాల వ్యాధులను నివారించే గుణం పసుపుకు ఉంది.
వర్షాకాలంలో దగ్గు, జలుబు, తుమ్ములు వంటి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ ల బారిన పడడం సహజం. వీటి బారిన పగడానే చాలా మంది యాంటీ బయాటిక్స్ ను వాడుతూ ఉంటారు. వీటిని ఉపయోగించడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. కానీ ఈ మందులను వాడడం వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే ఈ ఇన్ ఫెక్షన్ లను మనం సహజ సిద్ధంగా లభించే పసుపును ఉపయోగించి నయం చేసుకోవచ్చు.
దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడే వారు పసుపును ఉపయోగించడం వల్ల సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు. పసుపును ఏవిధంగా ఉపయోగించడం వల్ల మనం ఈ ఇన్ ఫెక్షన్ లనుండి బయట పడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజసిద్ధంగా ఇన్ ఫెక్షన్ ల నుండి బయట పడవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో పాలను, యాలకుల పొడిని వేసి వేడి చేయాలి.
పాలు వేడయ్యాక చిటికెడు పసుపును వేసి మరో పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత ఈ పాలను ఒకగ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఈ పాలను తాగడం వల్ల పదే పదే ఇబ్బంది పెడుతున్న దగ్గు, జలుబు చిటికెలో తగ్గిపోతాయి. ఈ చిట్కాను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వాడవచ్చు. ఈ విధంగా పసుపును పాలతో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ ఫెక్షన్ ల నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.