Hair Growth : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం అనే సమస్యతో అవస్థలు పడుతున్నారు. స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులకు కూడా ఈ సమస్య వస్తోంది. దీంతో వారు కొంత కాలానికి బట్టతలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే జుట్టు రాలడం అన్న సమస్యను ముందుగా గుర్తిస్తేనే.. దాన్ని నివారించి జుట్టు పెరిగేలా చేయవచ్చు. చివరి దశకు చేరుకున్న తరువాత చేసేదేమీ ఉండదు. అందువల్ల జుట్టు రాలితే ఆరంభంలోనే ఆ సమస్యను గుర్తించి అందుకు ఏవైనా మార్గాలను పాటించాలి. ఇక కింద తెలిపిన విధంగా చిట్కాను పాటించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. వద్దన్నా ఆగదు. ఇక ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబంద గుజ్జు ఒక టేబుల్ స్పూన్, ఒక ఉల్లిపాయ తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. అనంతరం అందులో కాస్త నీళ్లు పోసి ఒక వస్త్రంలో లేదా జల్లి గంటెలో ఉంచి ఆ మిశ్రమం నుంచి రసాన్ని తీయాలి. ఆ రసంలో కాస్త ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. అలాగే విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను 600 ఎంజీ మోతాదు ఉన్నవి రెండు తీసుకుని వాటిల్లోని మిశ్రమాన్ని కూడా ముందు సిద్ధం చేసుకున్న మిశ్రమంలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని జుట్టుకు బాగా రాయాలి. 10 నిమిషాల పాటు ఈ మిశ్రమం మొత్తంతో జుట్టుకు మర్దనా చేయాలి. కుదుళ్లకు తగిలేలా ఈ మిశ్రమాన్ని రాయాలి. తరువాత 1 గంట సేపు ఆగి హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారంలో రెండు సార్లు చేయాలి.
ఈ విధంగా క్రమం తప్పకుండా చిట్కాను పాటిస్తుంటే.. అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది. చుండ్రు తగ్గుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు చివర్లు చిట్లడం తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా ఆపవచ్చు. దీంతో జుట్టు వద్దన్నా పెరుగుతుంది. కలబంద జుట్టు మొత్తాన్ని శుభ్రం చేస్తే.. విటమిన్ ఇ క్యాప్సూల్స్ జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తాయి. అలాగే ఉల్లిపాయ, ఆలివ్ ఆయిల్ జట్టుకు నిగారింపును ఇచ్చి జుట్టును పెరిగేలా చేస్తాయి. కనుక ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తే అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.