Garlic And Hibiscus Oil For Hair : ఈరోజుల్లో చాలామంది, అందమైన కురులని పొందడం కోసం, అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఇంటి చిట్కాలు ని కూడా పాటిస్తున్నారు. మీ జుట్టు కూడా బాగా రాలిపోతోందా..? ఈ సమస్య నుండి బయట పడాలి అని అనుకుంటున్నారా..? ఇలా చేయడం మంచిది. ఊడిన జుట్టుని మొలిచేటట్టు ఇది చూస్తుంది. ఈ ఆయిల్ ని మనం తయారు చేసుకుని వాడినట్లయితే, అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. జుట్టు రాలడం కూడా ఉండదు. దీనికోసం ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని, శుభ్రంగా పొట్టు తీసేసి, తర్వాత మిక్సీ జార్ తీసుకొని, అందులో ఐదు నుండి 6 మందార పువ్వుల్ని వేయండి.
వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మందారం పూలు వెల్లుల్లి మిశ్రమాన్ని చిన్నమంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత, నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. స్టవ్ ఆపేసి, చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత, వడకట్టేసుకోవాలి.
ఈ ఆయిల్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. స్కాల్ప్ తో పాటుగా జుట్టు మొత్తానికి ఆయిల్ ని అప్లై చేసుకుని, మసాజ్ చేసుకోండి. ఉదయం ఆయిల్ ని అప్లై చేసుకుని సాయంత్రం తల స్నానం చేయాలి లేదంటే ఆయిల్ రాసుకున్న మరుసటి రోజు కూడా హెయిర్ వాష్ చేయొచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ని వాడడం వలన, జుట్టు రాలడం ఉండదు. మంచిగా జుట్టు ఎదుగుతుంది. కుదుళ్ళు బలంగా మారుతాయి. ఒత్తుగా, పొడుగ్గా ఎదుగుతాయి. అందమైన పొడవాటి కురులని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ళు, ఈ ఆయిల్ ని ట్రై చేస్తే చక్కటి రిజల్ట్ ఉంటుంది.