జామపండుని ఇష్టపడని వారు ఉండరు. రోజుకొక జామపండుని తింటే ఎటువంటి జీర్ణక్రియ సమస్యలు రావు. జామపండులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే తాజా అధ్యయనాల ప్రకారం జామ ఆకులలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయని వెల్లడించారు. జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. జామ ఆకులను తినడం వలన మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ ఆకుల్లో మంచి ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులతో ముఖ్యంగా ఐదు రకాల ఉపయోగాలున్నాయి. ఈ ఆకులు శరీరంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. సులువుగా మన శరీర బరువు తగ్గేలా చేస్తాయి. జామఆకుల నుంచి తయారైన టీ ద్వారా షుగరు వ్యాధి రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు జుట్టు ఎదుగుదలకు సహకరిస్తాయి. ఈ ఆకులను మెత్తగా నూరి తలకు పట్టిస్తే కురులు నల్లగా నిగనిగలాడతాయి.
జామ ఆకుల రసాన్ని రోజు తాగడం వలన శరీరంలోని అధిక కొవ్వును కరిగిస్తుంది. కొద్ది రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గుతారు. జామ ఆకులను, కొద్దిగా బియ్యపు పిండిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజు తాగడం వలన శరీర బరువును తగ్గించుకోవచ్చు. అందుకే జామపండ్లనే కాదు ,జామ ఆకులను కూడా తినండి. జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువు ఉన్నవారు జామ ఆకుల రసాన్ని రోజు తాగడం వలన సులువుగా బరువు తగ్గుతారు. ఇంకా డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.