Guava Leaves For Sugar : ప్రస్తుత కాలంలో యుక్తవయసులో ఉన్నవారిని ఎక్కువగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఇన్సులిన్ నిరోధకత కూడా ఒకటి. అసలు శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఉన్నట్టు తెలియదు కానీ ఇది త్వరగా షుగర్ వచ్చేలా చేస్తుంది. అధిక బరువుతో బాధపడే వారిలో, పిసిఒడి వంటి సమస్యలతో బాధపడే స్త్రీలల్లో ఇన్సులిన్ నిరోధకత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనకు సులభంగా లభించే పదార్థాలతో డికాషన్ తయారు చేసుకుని తాగడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే ఈ డికాషన్ ను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం మెంతులను, జామ ఆకులను, కాకరకాయ పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లను తీసుకోవాలి. తరువాత ఇందులో 3 లేదా 4 జామ ఆకులను, అర టీ స్పూన్ కాకరకాయ పొడిని, 2 టీ స్పూన్ మెంతులను వేసి నీటిని మరిగించాలి. ఈ నీటిని సగం అయ్యే వరకు బాగా మరిగించిన తరువాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న డికాషన్ లో 2 టీ స్పూన్ల తేనెను, అవసరమైతే కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తాగాలి. ఇన్సులిన్ నిరోధకత సమస్యతో బాధపడే వారు టీ, కాపీలకు బదులుగా ఇలా డికాషన్ ను తయారు చేసుకుని తాగడం వల్ల సమస్య అదుపులోకి వస్తుంది.
షుగర్ సమస్య ఉన్న వారు, షుగర్ సమస్య భవిష్యత్తుల్లో రాకూడదు అనుకునే వారు, అధిక బరువు సమస్యతో బాధపడే వారు, పిసిఒడి సమస్యతో బాధపడే స్త్రీలు ఎవరైనా ఈ డికాషన్ ను తీసుకోవచ్చు. ఈ డికాషన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే మం తీసుకున్న ఆహారంలో ఉండే గ్లూకోజ్ రక్తంలో ఎక్కువగా కలవకుండా ఉంటుంది. అలాగే ఈ డికాషన్ ను తీసుకోవడం వల్ల కణాల చుట్టూ ఉండే రిసెప్టార్స్ యొక్క సునితత్వం పెరుగుతుంది. దీని వల్ల గ్లూకోజ్ కణం లోపలికి సులభంగా వెళ్లగలుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ విధంగా మనకు సులభంగా లభించే పదార్థాలతో డికాషన్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత సమస్య తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.