సాధారణంగా జలుబు చేసినప్పుడు లేదా కొన్ని అలర్జీల కారణంగా ముక్కుదిబ్బడ ఏర్పడుతుంది. దీని కారణంగా తరచూ ముక్కు కారటం వంటి సమస్యలు ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ విధంగా అధిక ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు సహజంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి విముక్తి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!
* అధికంగా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారు పెప్పర్‌మెంట్ ఆయిల్ ఉపయోగించి ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. బాగా మరుగుతున్న నీటిలో ఐదు చుక్కలు పెప్పర్‌మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. దీంతో ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
* సోంపు, గడ్డి చామంతి, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి టీ లను తాగడం వల్ల వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
* ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారికి చికెన్ సూప్ మంచి ఉపశమనం కలిగిస్తుంది. చికెన్ సూప్ ముక్కులో శ్లేష్మం ఉత్పత్తిని తగ్గించడానికి దోహద పడుతుంది. కనుక చికెన్ సూప్ తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
* అధికంగా కారం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీని ద్వారా ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
* ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో అధిక భాగం విటమిన్-సి ఉండటం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కేవలం ఆరెంజ్ మాత్రమే కాకుండా పైనాపిల్, నిమ్మరసం వంటి జ్యూస్ లు తాగినా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
* అధిక ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడే వారు వీలైనంత వరకు పాలు, పాల ఉత్పత్తులను తగ్గించడం మంచిది. దీని వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మన ముక్కులో అధిక మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. కనుక ఈ సమస్యతో బాధపడేవారు పాల ఉత్పత్తులను పూర్తిగా తగ్గించడం లేదా మానేయడం చేయాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
* అధికంగా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారు ధూమపానం చేయడం వల్ల ఇంకా సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆవిరి పట్టుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కానీ ధూమపానం వల్ల శ్వాసక్రియకు ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక వీలైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉండాలి. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365