Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు..!

Sailaja N by Sailaja N
December 11, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

సాధారణంగా జలుబు చేసినప్పుడు లేదా కొన్ని అలర్జీల కారణంగా ముక్కుదిబ్బడ ఏర్పడుతుంది. దీని కారణంగా తరచూ ముక్కు కారటం వంటి సమస్యలు ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. ఈ విధంగా అధిక ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు సహజంగా ఇంటి చిట్కాలను ఉపయోగించి విముక్తి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!

home remedies for nasal congestion

* అధికంగా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారు పెప్పర్‌మెంట్‌ ఆయిల్ ఉపయోగించి ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. బాగా మరుగుతున్న నీటిలో ఐదు చుక్కలు పెప్పర్‌మెంట్‌ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. దీంతో ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

*  సోంపు, గడ్డి చామంతి, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి టీ లను తాగడం వల్ల వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

* ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారికి చికెన్‌ సూప్‌ మంచి ఉపశమనం కలిగిస్తుంది. చికెన్ సూప్ ముక్కులో శ్లేష్మం ఉత్పత్తిని తగ్గించడానికి దోహద పడుతుంది. కనుక చికెన్ సూప్ తీసుకోవడం వల్ల ఈ  సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

* అధికంగా కారం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీని ద్వారా ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

* ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ముక్కు దిబ్బడ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో అధిక భాగం విటమిన్-సి ఉండటం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కేవలం ఆరెంజ్ మాత్రమే కాకుండా పైనాపిల్, నిమ్మరసం వంటి జ్యూస్ లు తాగినా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

* అధిక ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడే వారు వీలైనంత వరకు పాలు, పాల ఉత్పత్తులను తగ్గించడం మంచిది. దీని వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మన ముక్కులో అధిక మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. కనుక ఈ సమస్యతో బాధపడేవారు పాల ఉత్పత్తులను పూర్తిగా తగ్గించడం లేదా మానేయడం చేయాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

* అధికంగా ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడేవారు ధూమపానం చేయడం వల్ల ఇంకా సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆవిరి పట్టుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కానీ ధూమపానం వల్ల శ్వాసక్రియకు ఇబ్బందులు తలెత్తుతాయి. కనుక వీలైనంత వరకు ధూమపానానికి దూరంగా ఉండాలి. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: nasal congestionrunny noseముక్కు దిబ్బ‌డముక్కు నుంచి నీరు కార‌డం
Previous Post

రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని నీటితో 2 లవంగాలను తీసుకోండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

Next Post

మ‌ళ్లీ ముంచుకొస్తున్న కోవిడ్ ముప్పు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 6 మార్గాలు..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను రోజూ పాటిస్తే మీ జుట్టుకు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

June 1, 2025
చిట్కాలు

సీతాఫ‌లం ఆకుల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా.. తెలిస్తే వెంట‌నే వాడుతారు..!

June 1, 2025
చిట్కాలు

కరివేపాకును అలా తీసిపారేయకండి..! అందులో ఉన్న ఔషధగుణాలను తెలుసుకోండి..!

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
చిట్కాలు

క‌డుపులో మంట‌గా ఉందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు..

May 31, 2025
చిట్కాలు

ముఖంపై ట్యాన్ పెరిగి న‌ల్ల‌గా మారింది.. ఈ చిట్కాను పాటిస్తే చాలు..

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!