ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండేందుకు చిట్కాలు..!

ఎండాకాలంలో సహజంగానే మన శరీరంలో నీరు త్వరగా ఇంకిపోతుంది. ద్రవాలు త్వరగా ఖర్చవుతుంటాయి. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది. అందుకనే వేసవిలో సాధారణం కన్నా ఎక్కువ నీటిని తాగాల్సి ఉంటుంది. అయితే మరీ ఎక్కువ సేపు నీటిని తాగకపోతే ఎండ దెబ్బ బారిన పడతారు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలంటే అందుకు కింద తెలిపిన సూచనలను పాటించాలి.

home remedies for sunstroke

1. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచేందుకు మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. మజ్జిగలో ప్రొ బయోటిక్స్‌, ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. ఒక గ్లాస్‌ మజ్జిగలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని రోజుకు ఒకటి రెండు గ్లాసులు తాగితే వేసవిలో చల్లగా ఉండవచ్చు. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు.

2. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండేందుకు పెసలు ఎంతగానో ఉపయోగపడతాయి. పెసలను నీటిలో కొన్ని గంటలపాటు నానబెట్టి తరువాత వాటిని ఉడికించి తినాలి. రోజూ ఒక కప్పు మోతాదులో పెసలను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.

3. ఎండ దెబ్బ బారిన పడిన వారు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను వాడితే మంచిది. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. ముఖ్యంగా పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ను వాడడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. 2-3 చుక్కల పెప్పర్‌మింట్‌ ఆయిల్‌, 1-2 చుక్కల లావెండర్‌ ఆయిల్‌, 2 టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ను కలిపి మిశ్రమంగా చేసి దాన్ని మెడ వెనుక భాగంలో రాయాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

4. వడదెబ్బకు గురైన వారిని రక్షించేందుకు ఉల్లిపాయల రసం పనిచేస్తుంది. ఉల్లిపాయల నుంచి రసం తీని దాన్ని చెవుల వెనుక రాయాలి. అలాగే పాదాలు, ఛాతిపై ఆ రసంతో మర్దనా చేయాలి. ఒక టీస్పూన్‌ ఉల్లిపాయల రసంతో అంతే మోతాదులో తేనెను కలిపి తాగాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గి వడదెబ్బ నుంచి కోలుకుంటారు.

5. చింతపండులో విటమిన్లు, మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు చింతపండులోని పోషకాలు మనల్ని రక్షిస్తాయి. మరుగుతున్న నీటిలో కొద్దిగా చింతపండు వేసి నానబెట్టాలి. అనంతరం నీటిని వడకట్టి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి మిశ్రమం చల్లగా అయ్యాక తాగాలి. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

6. వడదెబ్బకు గురైన వారు పచ్చి మామిడికాయల రసం తాగాలి. ఇది చాలా ఆరోగ్యవంతమైనది. కొన్ని పచ్చిమామిడికాయలను నీటిలో మరిగించాలి. అవి బాగా ఉడికాక అందులో మరింత నీటిని కలిపి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. అనంతరం వచ్చే పానీయంలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, అవసరం అనుకుంటే చక్కెర కలిపి సేవించాలి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ బారిన పడినవారు త్వరగా కోలుకుంటారు. శరీరం చల్లగా అవుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts