యాలకులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డబ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇతర మాంసాహార వంటకాలు, ప్రత్యేకమైన శాకాహార వంటకాలు చేసినప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంటకాలకు చక్కని వాసన, రుచి వస్తాయి. అయితే యాలకులను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!
* ఒక యాలక్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒకసారి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
* ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి. దీంతో గొంతు సమస్యలు పోతాయి.
* యాలకులతో తయారు చేసిన డికాషన్‌ను తాగడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. చల్లార్చిన డికాషన్ తాగాల్సి ఉంటుంది.
* యాలకుల పొడి, పిప్పళ్ల పొడిని కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి నెయ్యితో తీసుకోవాలి. దీంతో కడుపునొప్పి తగ్గుతుంది.
* యాలకులు, బెల్లం వేసి తయారు చేసి డికాషన్‌ను రోజుకు 3 సార్లు తీసుకుంటే తలతిరగడం తగ్గుతుంది.
* నీటిని మరిగించాక అందులో యాలక్కాయలు, పుదీనా ఆకులు కొద్దిగా వేసి 5 నిమిషాలు ఆగాక ఆ నీటిని తాగాలి. దీంతో వెక్కిళ్లు తగ్గుతాయి.
* గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా తేనె, యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగితే మగవారిలో అంగస్తంభన సమస్య ఉండదు.
* అరటిపండ్లతో కలిపి యాలకులను తింటే వాంతులు, వికారం తగ్గుతాయి.
* అతి మధురం, యాలకుల పొడిని కలిపి దాన్ని తేనెతో ఒక టీస్పూన్ మోతాదులో సేవిస్తుంటే దంతాల నొప్పి తగ్గుతుంది.
* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో పావు టీస్పూన్ యాలకుల పొడిని వేసి బాగా మరిగించి అనంతరం గోరు వెచ్చగా ఉండగానే ఆ నీటిని తాగేయాలి. దీంతో డిప్రెషన్ తగ్గుతుంది.
* తలనొప్పి, అజీర్ణం సమస్యలు ఉన్నవారు యాలకుల టీని తాగితే ఫలితం ఉంటుంది.
* యాలకుల పొడి, సోంపు గింజల పొడిని తీసుకుని ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. భోజనం చేసిన తరువాత తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అజీర్ణ సమస్య ఉన్నవారు ఇలా చేయాలి. రోజుకు 2 సార్లు ఇలా తాగాల్సి ఉంటుంది.
* యాలకుల పొడి, అల్లం పొడి, సోంపు గింజల పొడిలను చిటికెడు మోతాదులో తీసుకుని కలపాలి. అనంతరం ఆ మిశ్రమం నుంచి 1 టీస్పూన్ మోతాదులో పొడిని తీసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువను కూడా తీసుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను ఒక కప్పు నీటిలో కలిపి తాగితే గ్యాస్ సమస్య ఉండదు.