Jilledu Aku : రోజూ రెండు ఆకులను ఉపయోగించి డయాబెటిస్ ను నియంత్రిచుకోవచ్చు. రెండు పచ్చటి ఆకులను ఉపయోగించి డయాబెటిస్ ను తరిమి కొట్టవచ్చు. పచ్చటి ఆకులతో షుగర్ వ్యాధిని తరిమికొట్టవచ్చా.. అది ఎలాగో తెలుసుకుందాం. డయాబెటిస్ ను డయాబెటిస్ మెలిటస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడం కానీ ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం కానీ జరుగుతుంది. శరీరంలోని కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతుంది.

ఈ వ్యాధికి చికిత్సను తీసుకుని మందులు వాడి విసిగిపోయి ఉన్నవారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. అయితే ఈ ఆకులను వాడడం మొదలు పెట్టండి. ఈ ఆకులను వాడడం వల్ల మీరు చక్కటి ఫలితాలను పొందవచ్చు. అసలు ఈ ఆకులను తినాల్సిన పని లేదు. వీటిని జ్యూస్ గా చేసుకుని తాగాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా పాదాలను జిల్లేడు ఆకులతో స్పృశించడమే. చాలా మంది జిల్లేడు ఆకులు ఏంటి.. షుగర్ వ్యాధిని నియంత్రించడం ఏంటి.. అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లేడు ఆకులు షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
రెండు తాజా జిల్లేడు ఆకులను తీసుకుని తీసుకుని పాదాల అడుగు భాగంలో ఉంచాలి. అలాగే పాదాలను సాక్స్ తో, షూస్ తో కప్పి ఉంచాలి. రెండు పాదాలకు కూడా ఇలాగే చేయాలి. ఈ ఆకులను రోజంతా అలాగే ఉంచాలి. పడుకునే ముందు వాటిని తీసేసి పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజులు పాటు చేయాలి. ప్రతిసారి కూడా కొత్త జిల్లేడు ఆకులను ఉపయోగించాలి. ఇలా వారం రోజులు చేసిన తరువాత షుగర్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందవచ్చు. ఇలా షుగర్ వ్యాధి నియంత్రణలోకి వచ్చే వరకు చేయాలి.
ఈ చిట్కాను పాటించేటప్పుడు జిల్లేడు ఆకుల నుండి వచ్చే పాలను కంట్లో పడకుండా చూసుకోవాలి. జిల్లేడు పాలు కళ్లల్లో పడడం వల్ల కంటి చూపు కోల్పోతాము. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఈ చిట్కాను పాటించకపోవడమే మంచిది. డయాబెటిస్ ను నియంత్రించే మరికొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో కాకరకాయ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాకర కాయ జ్యూస్ ను ఒక టబ్ లో పోసి అందులో కాళ్లను ఉంచి ఒక కాలును మరో కాలుతో వత్తుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 20 నుండి 25 రోజుల పాటు పాటించడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఈ పద్దతి షుగర్ వ్యాధిని నియంత్రించడంలో చక్కగా పని చేస్తుంది.
ఈ పద్దతిని పాటించిన వంద మందిలో 99 శాతం మంది చక్కటి ఫలితాలను పొందవచ్చు. అవసరమైతే కాకర కాయ జ్యూస్ ను కూడా తాగవచ్చు. ఇలా చేస్తూ వ్యాయామాలను చేయాలి. 7 నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి. ప్రతిరోజూ 10 గంటలకే నిద్రపోయి ఉదయాన్నే వేకువ జామున నిద్రలేవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉండడంతోపాటు ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. పైన చెప్పిన పద్దతులను పాటిస్తూ తరచూ షుగర్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఇలా ప్రతి మూడు రోజులకు ఒకసారి షుగర్ స్థాయిలను పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పద్దతులను పాటించడం వల్ల షుగర్ వ్యాధిని సులభంగా నియంత్రించుకోవచ్చు.