Nadi Examination : గుండె జబ్బులతో బాధపడే వారు నేటి తరంలో ఎక్కువవుతున్నారనే చెప్పవచ్చు. భవిష్యత్తులో గుండె జబ్బులు వస్తాయేమోనని భయపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ భయంతోనే చాలా మంది డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఇలా పరీక్షలు చేయించుకోవడం మంచి పద్దతేనా అంటే మంచి పద్దతే అని చెప్పవచ్చు. అయితే ఒక చిన్న పద్దతిని ఉపయోగించి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో పరీక్షించికుని అక్కడి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ పద్దతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఆ పద్దతే నాడీ విధానం.
నాడి పట్టుకుని మన ఆరోగ్య పరిస్థితి చెప్పడం. ఆరోగ్య స్థితిని అంచనా వేసే పద్దతుల్లో నాడి చూసుకోవడం చాలా తేలికైనది. అలాగే సమర్థవంతమైనది కూడా. కేవలం 30 సెకన్లలోనే మన గుండె కండరం పనితీరును ఎంతో కొంత తెలుసుకోవచ్చు. మణికట్టు వద్ద బొటన వేలు కింది భాగంలో కానీ, మెడకు ఒక వైపున కానీ రెండు వేళ్లతో ఒక్కింత గట్టిగా అదిమి పడితే ఎవరికి వారు నాడి కొట్టుకోవడాన్ని గమనించవచ్చు. ఇందులో మొదటగా మనం చేయాల్సింది విశ్రాంతిగా కూర్చోవడం.
మెల్లగా మణికట్టు వద్ద వేళ్లతో అదిమి నాడిని పరిక్షించుకోవాలి. విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని బట్టి మన ఆరోగ్య స్థితిని ముందు ముందు తలెత్తే ఆరోగ్య సమస్యలను అంచనా వేయవచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకన్ల సమయంలో ఎన్నిసార్లు నాడి కొట్టుకుంటుందో లెక్కించి దాన్ని రెట్టింపు చేస్తే ఒక నిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత బాగుందని అర్థం. ఇలాంటి వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

విశ్రాంతి సమయంలో గుండె ఎంత వేగంగా కొట్టుకుంటే గుండె జబ్బులు వచ్చే ముప్పు పెరుగుతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అసలు గుండె ఎన్ని సార్లు కొట్టుకోవాలి. సాధారణంగా పెద్ద వారు విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె 60 నుండి వంద సార్లు కొట్టుకుంటుంది. కానీ అంత కంటే తక్కువగా 50 నుండి 70 సార్లు కొట్టుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. గుండె వేగం ఎక్కువగాఉన్న వారిలో శారీరక సామర్థ్యం తక్కువగాను, రక్తపోటు, బరువు, రక్తంలో ప్రసరించే కొవ్వుల శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గుర్తించారు. వీరిలో అకాల మరణం ముప్పు పెరుగుతుంది.
ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 80 నుండి 91 సార్లు నాడీ కొట్టుకునే వారిలో గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతుందని బయటపడింది. ఇక 90 కన్నా ఎక్కువ సార్లు గుండె కొట్టుకునే వారిలో ఈ ముప్పు మూడింతలు ఎక్కువగా ఉండడం గమన్హారం. ఇక గుండె వేగాన్ని ఒత్తిడి, ఆంతోళన, రక్తంలో ప్రవహించే హార్మోన్లతోపాటు రక్తపోటు, ఆందోళన తగ్గడానికి వేసుకునే మందులు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి విశ్రాంతి సమయంలో గుండె వేగాన్ని సరిగ్గా గుర్తించడానికి వారం మొత్తం మీద వేరు వేరు సమయాల్లో అప్పుడప్పుడూ పరిక్షించుకోవాలి.
చాలా సందర్భాల్లో 80 కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ఎప్పుడు ఈ నాడిని పరిక్షించుకోవాలంటే శారీరక శ్రమ, వ్యాయామం చేసిన రెండు గంటల తరువాత అలాగే కాఫీ, టీ లు తాగిన అరగంట తరువాత పరిక్షించుకోవాలి. ఉదయం పూట నిద్రలేవగానే మంచం దిగకుండా నాడి వేగాన్ని పరిక్షించుకోవడం ఉత్తమం. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే పూడికలు పెరిగి రక్తప్రసారం తగ్గుతుంది. దీంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుకోవాలి.