Kerala Style Hair Oil : మనకు సులభంగా లభించే పదార్థాలతో నూనెను తయారీ చేసి వాడడం వల్ల ఒత్తైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. నేటి తరుణంలో మనలో చాలా మంది జుట్టు ఊడిపోవడం, జుట్టు పలుచబడడం, చుండ్రు, జుట్టు విరిగిపోవడం వంటి వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, పోషకాహార లోపమే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇటువంటి జుట్టు సమస్యల నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే నూనెలను వాడడానికి బదులుగా ఇంట్లోనే నూనెను తయారీ చేసి వాడడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరుగుతుంది.
ఈ నూనెను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎక్కువగా కేరళ వారు ఈ విధంగా నూనెను తయారీ చేసి వాడుతూ ఉంటారు. ఇలా తయారు చేసిన నూనెను వాడడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ నూనెను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ 500 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను, గుప్పెడు కరివేపాకును, 4 గంటల పాటు నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ మెంతులను, 2 టేబుల్ స్పూన్ల మందార ఆకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును, 10 నుండి 15 చిన్న ఉల్లిపాయలను, 10 నుండి 12 మిరియాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక జార్ లో కరివేపాకు ఆకులు, మెంతులు, ఉల్లిపాయలు, మందార ఆకుల పొడి, కలబంద గుజ్జు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక ఇనుప కళాయిలో ఈ పేస్ట్ ను వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి నూనెను కూడా వేసి 10 నుండి 12 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత మిరియాలు వేసి మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకు పట్టించే ముందు తగినంత నూనెను తీసుకుని గోరు వెచ్చగా చేసుకుని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. జుట్టు కుదుళ్లకు తగినన్ని పోషకాలన్నీ అంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు ఈ నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.