Warm Water : వయసు పెరిగే కొద్ది పలు రకాల అనారోగ్య సమస్యలు రావడం సహజం. అలాంటి అనారోగ్య సమస్యల్లో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఒకటి. ఈ సమస్య ఒక్కసారి తలెత్తింది అంటే ఇక మనల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ సమస్య బారిన పడిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వారి రోజూ వారి పనులను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. వైద్యులు సూచించిన మందులే ఈ సమస్యకు పరిష్కారం అని చాలా మంది అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఉండే పదార్థాలతో కూడా ఈ సమస్య నుండి బయట పడవచ్చని చాలా మందికి తెలియదు. మన ఇంట్లో ఉండే శొంఠి పొడి, పసుపును ఉపయోగించి మనం కీళ్ల నొప్పుల సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. శొంఠిపొడిలో, పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
వీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు మనం శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. మన రోజువారి ఆహారంలో ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి పసుపును, శొంఠి పొడిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో అర టీ స్పూన్ పసుపును, పావు టీ స్పూన్ శొంఠి పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ పానీయం మన శరీరానికి పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది. ఈ పానీయాన్ని తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను కూడా పొందవచ్చు.
పసుపు, శొంఠి పొడి కలిపిన పానీయాన్ని క్రమం తప్పకుండ నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం మానివేయాలి. జంక్ ఫుడ్ ను, రెడ్ మీట్ ను, ఆర్టిఫిషియల్ చక్కెరలకు, ప్రాసెస్ట్ ఫుడ్ కు, ఆల్కహాల్ కు చాలా దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు బరువును పెంచడంతో పాటు శరీరంలో నొప్పులకు దారి తీస్తాయి. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూనే క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా కీళ్ల నొప్పుల సమస్య నుండి మనం బయటపడవచ్చు.