మనకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు శరీర భాగాలు మంటలో కాలుతుంటాయి. లేదంటే మంట సెగ కూడా తగులుతుంది. లేదా వంట చేసేటప్పుడు మహిళలకు చేతులు కాలుతుంటాయి. ఇలా పలు భిన్న సందర్భాల్లో మనకు కాలిన గాయాలు అవుతుంటాయి. అయితే ఇలాంటి గాయాలు అయితే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించే కాలిన గాయాలను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిన గాయం అయిన వెంటనే ట్యాప్ కింద శరీర భాగాన్ని ఉంచి నీళ్లను పడేలా చేయాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి. తరువాత సబ్బుతో కడిగేయాలి. కాలిన గాయం అయిన వెంటనే ఈ చిట్కాను పాటిస్తే చాలా వరకు నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కాలిన గాయం నుంచి ఉపశమనం అందించేందుకు కలబంద గుజ్జు కూడా పనిచేస్తుంది. కలబందలో సహజసిద్ధమైన యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక కలబంద గుజ్జును అప్లై చేస్తే నొప్పి, మంట తగ్గుతాయి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
కాలిన గాయం నుంచి ఉపశమనం అందించేందుకు తేనె కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. అలాగే కొబ్బరినూనె లేదా యాపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా రాయవచ్చు. ఇవి కూడా కాలిన గాయాల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీంతో నొప్పి, మంట తగ్గుతాయి.