Onions For Piles : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో మొలల వ్యాధి కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మొలల కారణంగా మలవిసర్జన సమయంలో మరింత ఇబ్బందిని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ మొలల వల్ల కలిగే నొప్పి వర్ణణాతీతంగా ఉంటుంది. ఈ సమస్య బారిన పడిన వారు నొప్పి కారణంగా ఎక్కువ సేపు కూర్చొలేక పోతుంటారు. అలాగే కొందరిలో ఈ మొలలు దురదను కూడా కలిగిస్తాయి. మొలల సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, మలబద్దకం, నీటిని ఎక్కువగా తాగకపోవడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వంటి వాటిని ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
వైద్యులు ఈ సమస్య నుండి బయట పడడానికి ఎక్కువగా శస్త్రచికిత్సను సూచిస్తూ ఉంటారు. అయితే శస్త్ర చికిత్స చేసినప్పటికి ఈ సమస్య మరలా తలెత్తూ ఉంటుంది. కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి మనం ఈ మొలల సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు. మొలల సమస్య నుండి బయట పడేసే కొన్ని ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొలల సమస్యను తగ్గించడంలో ఉల్లిపాయ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను ముక్కలుగా చేసి ఉడికించాలి. తరువాత ఈ ఉల్లిపాయను మిక్సీ పట్టుకుని దాని నుండి రసాన్ని తీయాలి.
ఈ రసంలో పటిక బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల మొలల సమస్య నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అదే విధంగా పసుపును ముద్దగా చేసి కొద్దిగా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన పసుపును మొలలపై రాయడం వల్ల మొలల రాలిపడిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే వెల్లుల్లి రెబ్బలను లేదా ఒంటి రెక్క వెల్లుల్లిని దంచి ముద్దగా చేసి ఈ మిశ్రమాన్ని మొలలపై రాయడం వల్ల కూడా మొలలు రాలిపడిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ మొలల సమస్యను తగ్గించడంలో ఉలవలు కూడా మనకు ఉపయోగపడతాయి.
ఉలవలను ఉడికించి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మొలలపై రాసి దానిపై తమలపాకును ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా మొలల సమస్య నుండి మనకు ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల చాలా తక్కువ సమయంలో ఎటువంటి శస్త్ర చికిత్సతో పని లేకుండా మొలల సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే ఈ చిట్కాలను పాటిస్తూ నీటిని ఎక్కువగా తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం, చక్కటి జీవన విధానాన్ని పాటించడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది.