Pepper And Cow Ghee : వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో కంటి చూపు మందగించడం ఒకటి. పూర్వకాలంలో వయసుపై బడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య నేటి తరుణంలో చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాము. కళ్లద్దాలు ధరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. కంటి చూపు మందగించిన తరువాత బాధపడడం కంటే అది రాకుండా జాగ్రత్త పడడమే మంచిది. కంటిచూపు తక్కువగా ఉన్నవారు కింద చెప్పే ఒక చక్కటి చిట్కాను వాడడం వల్ల కళ్లద్దాలు వాడే అవసరం లేకుండా కంటి చూపు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల భవిష్యత్తులో చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. కంటిచూపును మెరుగుపరిచే చిట్కాను అలాగే తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కంటిచూపు తక్కువగా ఉన్న వారు ముందుగా ఒక 4 లేదా 5 మిరియాలను తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ లేదా ముప్పావు టీ స్పూన్ మోతాదులో పటిక బెల్లం పొడిని, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. అలాగే దీనిని తీసుకున్న ఒక గంట వరకు ఎటువంటి ఆహార పదార్థాలను, నీటిని తీసుకోకూడదు.

అదే విధంగా ఈ మిశ్రమాన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నిల్వ చేసుకోవడానికి బదులుగా ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని తీసుకున్న వారం రోజుల్లోనే మన కంటి చూపులో వచ్చే తేడాను మనం గమనించవచ్చు. వారం రోజుల్లో తేడా కనిపించినప్పటికి మూడు నెలల పాటు ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించాలి. ఈ విధంగా ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ చిట్కాతో పాటు కంటి చూపు తక్కువగా ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కంటి చూపు చక్కగా ఉండాలంటే మన శరీరానికి తగినన్ని పోషకాలు అందడం కూడా చాలా అవసరం.
కంటి చూపును మెరుగుపరచడంలో మునగాకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మునగాకును పప్పుగా లేదా కారం పొడిగా తయారు చేసుకుని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల కళ్లకే కాకుండా చర్మానికి కూడా మేలు కలుగుతుంది. అదే విధంగా క్యారెట్, గుడ్లు, చిలగడ దుంపలు, చేపలు, పాల పదార్థాలు, బాదం పప్పు వంటి వాటిని తీసుకోవాలి. ఇవి కంటి ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సహాయపడతాయి. కంటి చూపు తక్కువగా ఉన్న వారు ఈ విధంగా చిట్కాను పాటిస్తూ, చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.