Piles Home Remedies : మోషన్ వచ్చేటప్పుడు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ వెళ్లేటప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా, చాలామంది పైల్స్ అని భావిస్తారు. అయితే, అసలు ఫైల్స్ అంటే ఏమిటి..? ఎందుకు ఫైల్స్ సమస్య వస్తుంది…? పైల్స్ ని ఎలా గుర్తించొచ్చు..? వంటి ముఖ్య విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మోషన్ వెళ్లేటప్పుడు రక్తం వచ్చినా, ఇబ్బంది పడ్డా, లేదంటే మలం వచ్చే దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్నా, అది పైల్స్ కాదు. పైల్స్, ఫిస్టులా, ఫిషెర్స్, స్కిన్ టాగ్ ఇలా నాలుగు రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఫైల్స్ ఉంటే నొప్పి రాదు.
ఎందుకంటే ఇది లోపల ఉంటుంది. లోపల రక్తానాళాలు ఉబ్బి ఉండడం వలన, మోషన్ వెళ్ళాక రక్తం పడితే, పైల్స్ ఉన్నట్లు గుర్తించొచ్చు. మల పేగుల్లో రక్తనాళాలు గడ్డ కట్టడం, అవి ఉబ్బి వాపు రావడానికి ఫైల్స్ అంటారు. రబ్బర్ బ్యాండ్ వేసి వీటిని కంట్రోల్ చేయొచ్చు. మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం వచ్చినట్లయితే, దానిని ఫిషర్ అంటారు. మలం వెళ్ళేటప్పుడు, విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. మోషన్ వెళ్లే చోటు నుండి చీరకు పోయి, రక్తం మలంతో వస్తుంది.
మోషన్ ఫ్రీగా అవ్వకుండా గట్టిగా తయారై ఇలా అయిపోతుంది. ఫిస్టులా అంటే మల్లం వెళ్లే దారిలో చీము, గడ్డలు తయారవుతాయి. అవి పగిలిపోవడంతో, అప్పుడప్పుడు చీము వస్తూ ఉంటుంది. స్కిన్ చిన్న తోకలాగ చర్మం పెరగడం వంటివి జరుగుతాయి. పసుపు, కలబంద గుజ్జు లేదంటే ఆముదం నూనె కలిపి రాసినట్లయితే ఈ సమస్య తగ్గుతుంది.
రాత్రి పడుకునే ముందు చిన్న స్పూన్ ఆముదం పాలలో కలిపి తాగితే మంచిది. రోజు నీళ్లు బాగా తాగాలి. అదేపనిగా కూర్చుంటే కూడా ఈ సమస్య ఎక్కువ వస్తుంది. పైల్స్ రాకుండా ఉండాలంటే, రోజు కొంచెం సేపు నడుస్తూ ఉండాలి. పీచు పదార్థాలని బాగా తినాలి.