పైల్స్ సమస్య ఉన్నవారి బాధ మాటల్లో చెప్పలేం. వారు ఆ సమస్యతో నరక యాతన అనుభవిస్తారు. అయితే ఈ సమస్య వచ్చేందుకు ఎన్నో కారణాలుంటాయి. అయినప్పటికీ కింద తెలిపిన పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. దాంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకులు (బే లీవ్స్), 3 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అనంతరం ఆ నీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మిశ్రమం మరిగాక దాన్ని చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే పైల్స్ సమస్య తగ్గుతుంది.
* కమోమిల్ (తెల్ల చామంతి) పువ్వు తీసుకుని దాన్ని నీటిలో వేసి డికాక్షన్ కాయాలి. ఆ డికాక్షన్‌ను చల్లార్చి సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఉపశమనం కలుగుతుంది.
* చిన్న గ్లాస్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి. కొద్ది సేపు ఆగాక వాటిని తీసి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో పైల్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
* కలబంద గుజ్జును పైల్స్‌పై అప్లై చేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు.
* ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా అల్లం రసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను ఒక గిన్నెలో తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. దీంతో పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టీ ట్రీ ఆయిల్ ను ఆముదం లేదా బాదం నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్‌పై రాయాలి. ఇలా తరచూ చేయాలి. దీంతో పైల్స్ త్వరగా తగ్గుతాయి.