Pippintaku For Digestion : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న అనారోగ్య సమస్య తలెత్తగానే వైద్యున్ని సంప్రదించి మందులను వాడుతున్నారు. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఈ మందులపై ఆధారపడి జీవిస్తున్నారు. అడ్డుఅదుపు లేకుండా మందులను విరివిరిగా వాడడం వల్ల భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు వచ్చే ఈ అనారోగ్య సమస్యలను మనం ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఆయుర్వేద మందులను వాడడానికి భయపడుతున్నారు. వీటిని వాడడం వల్ల అనారోగ్య సమస్య తగ్గుతుందో లేదా అన్న సందేహం అందరిలోనూ నెలకొంటుంది. ఎటువంటి సందేహం లేకుండా ఆయుర్వేద మందులను వాడడం వల్ల మనం ఎటువంటి అనారోగ్య సమస్యనైనా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద మందులను వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాము. అయితే ఈ మందులను వాడేటప్పుడు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణ ఉండడం చాలా అవసరం.
తెలిసి తెలియక ఈ మందులను వాడితే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా మనకు వచ్చే వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కుప్పింటాకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని పిప్పి పన్ను ఆకు, పిప్పింటాకు అని కూడా అంటారు. ఇది ఎటువంటి నేలలోనైనా సులవుగా పెరుగుతుంది. రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో, పొలాల దగ్గర, చేల దగ్గర ఎక్కడపడితే అక్కడ ఈ మొక్క పెరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను విరివిరిగా ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కుప్పింటాకు ఆకులను దంచి రసాన్ని తీయాలి.
ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కల మోతాదులో ముక్కలో వేసుకోవడం వల్ల ఎంతటి తలనొప్పైనా తగ్గుతుంది. అలాగే ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమం నుండి రసాన్ని తీసి తేలు లేదా పాము కాటుకు గురైన చోట రాయాలి. అలాగే ఈ పిప్పిని తినాలి. ఇలా చేయడం వల్ల విషం హరించుకుపోతుంది. అలాగే ఈ కుప్పింటాకు మొక్క ఆకులకు రాళ్ల ఉప్పును కలిపి మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మం పై రాయడం వల్ల దురద, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే ఈ ఆకుల రసాన్ని ఒకటి లేదా రెండు టీ స్పూన్ల మోతాదులో రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల మరుసటి రోజూ ఉదయం పూట సుఖ విరోచనం అవుతుంది. అలాగే పొట్ట కూడా శుభ్రం అవుతుంది. కుప్పింటాకు మొక్క ఆకులను వేడి చేసి దాని నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది.
అలాగే చెవి నుండి శబ్దం రావడం కూడా తగ్గుతుంది. ఈ మొక్క వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల దంతాలకు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే ఈ మొక్క ఆకుల రసంలో దూదిని ముంచి పిప్పి పన్నుపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి, బాధ తగ్గుతాయి. ఈ విధంగా కుప్పింటాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.