Garlic : వెల్లుల్లి.. భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వంటల తయారీలో, పచ్చళ్ల తయారీలో దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా వెల్లుల్లిని ఉపయోగిస్తారు. మన శరీరానికి వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు. కొవ్వును కరిగించడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, క్యాన్సర్ రాకుండా చేయడంలో, వీర్యాన్ని వృద్ధిచేయడంలో, దోమలను తరిమి కొట్టడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో, జీర్ణశక్తిని పెంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా వెల్లుల్లి మనకు సహాయపడుతుంది.
నీరుల్లిలో కంటే వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. సంప్రదాయ చైనా వైద్యంలో కూడా వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురుగు కాటుకు వెల్లుల్లి దివ్యౌషధంగా పని చేస్తుంది. విషానికి విరుగుడిగా కూడా వెల్లుల్లి పని చేస్తుంది. వెల్లుల్లి రసాన్ని, నిమ్మరసాన్ని కలిపి చర్మ సమస్యలు ఉన్న చోట రాయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిని అలాగే తేనెను మనం నిత్యం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి రెండు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిని తేనెను కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
వెల్లుల్లిని నేరుగా తినలేని వారు వెల్లుల్లి రసంలో తేనెను కలిపి తీసుకోవచ్చు. వెల్లుల్లిని తేనెను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి, తేనె కలిపిన మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో చర్మం మీద ముడతలు తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలు వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాలింతలు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. జ్వరంతో బాధపడుతున్నప్పుడు వెల్లుల్లి రసాన్ని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి.
ఇది జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే క్యాన్సర్ ను నివారిస్తుంది. ఆస్థమాను అరికడుతుంది. జలుబు, దగ్గుల నుండి ఉపశమనాన్ని కలిగించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటిపూతను తగ్గించడంలో, చర్మం పై దురదలను, పగుళ్లను తగ్గించడంలో , రక్తంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో వెల్లుల్లి మనకు ఎంతో దోహదపడుతుంది. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల విష జ్వరాలు కూడా తగ్గిపోతాయి. వెల్లుల్లి రెబ్బను పొట్టు తీసి నోట్లో పెట్టుకోవాలి. దీని నుండి వచ్చే లాలాజలాన్ని మింగుతూ అర గంట పాటు అలాగే ఉండాలి. వెల్లుల్లిలో ఉండే ఆరోగ్యకరమైన గుణాలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇలా వెల్లుల్లిని నోట్లో పెట్టుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. రక్తహీనత, శ్వాస సమస్యలు తొలగిపోతాయి. మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని , దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.