Radish For Piles : చాలామంది ముల్లంగిని తింటూ ఉంటారు. ముల్లంగి వలన కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముల్లంగితో అనేక రకాల వంటకాలని మనం తయారు చేసుకోవచ్చు. చాలామంది ముల్లంగిని తినడానికి ఇష్టపడుతుంటారు కూడా. ముల్లంగిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకుంటే, అద్భుతమైన ప్రయోజనాలని పొందొచ్చు. ముల్లంగితో మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలానే ముల్లంగిని తీసుకుంటే, శరీర బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
ముల్లంగిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ బి వంటివి ఉంటాయి. ముల్లంగిని తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ముల్లంగి. ముల్లంగితో చర్మ సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. ముల్లంగి గుజ్జుని ముఖానికి రాసుకుంటే, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. జ్వరం వంటి బాధల నుండి కూడా బయటపడొచ్చు.
ముల్లంగిని తీసుకుంటే ఆకలిని పుట్టించొచ్చు. నోటి నుండి వచ్చే శ్వాస కూడా తాజాగా ఉంటుంది. రక్త సరఫరాని కూడా మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి వంటి బాధలు కూడా ఉండవు. ముల్లంగిని తీసుకోవడం వలన కడుపులో ఉండే రోగాలు కూడా దూరం అవుతాయి. ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. కాలేయం పని చేయనప్పుడు ముల్లంగి ఆకుల రసం తాగితే, కాలేయం సక్రమంగా పనిచేస్తుంది.
రక్తం కూడా శుభ్రంగా ఉంటుంది. ముల్లంగిని తీసుకోవడం వలన పైల్స్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లు ముల్లంగితో త్వరగా బయటపడొచ్చు. ముల్లంగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల ముల్లంగిని తీసుకుంటే, పైల్స్ సమస్య నుండి బయట పడొచ్చు. పైల్స్ ప్రారంభ దశలో నుండి ఉపశమనం లభిస్తుంది. తెల్ల ముల్లంగి పొడిలో కొంచెం పాలు వేసి పైల్స్ ఉన్న చోట రాసుకుంటే, ఉపశమనం ఉంటుంది.