Sea Of Energy Point : సరైన వేళకు భోజనం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, అనారోగ్యాలు.. వంటి అనేక కారణాల వల్ల మనలో అధిక శాతం మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. నిత్యం గంటల తరబడి టాయిలెట్స్‌కు వెళ్లినా ఫలితం ఉండడం లేదు. ఎంతో సేపు బలవంతంగా ఓపిక పట్టి మరీ కూర్చున్నా సుఖ విరేచనం అవడం లేదు. దీంతో మలబద్దకం ఇతర అనేక అనారోగ్యాలకూ దారి తీస్తోంది. అయితే కింద ఇచ్చిన ఓ టిప్‌ను పాటిస్తే ఇకపై మిమ్మల్ని మలబద్దకం సమస్య బాధించదు. సుఖంగా విరేచనం అవుతుంది. బాత్‌రూంకు వెళ్లిన 5 నిమిషాల లోపే మీ పని పూర్తయిపోతుంది. ఆ టిప్ ఏమిటంటే..
ఆక్యుప్రెషర్ వైద్యం గురించి తెలుసు కదా. శరీరంలో ఉన్న నిర్దిష్టమైన భాగాల్లో కొంతసేపు ఒత్తిడి కలిగించడం ద్వారా ఆయా అవయవాలకు చెందిన సమస్యలను ఇట్టే తొలగించవచ్చు. అయితే ఇదే ఆక్యుప్రెషర్ వైద్యం సుఖ విరేచనం అవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. ఆక్యుప్రెషర్ వైద్యం చెబుతున్న ప్రకారం.. మన శరీరంలో బొడ్డు కిందుగా సీ ఆఫ్ ఎనర్జీ (sea of energy) అనే ఓ పాయింట్ ఉంటుంది. దానిపై 10 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు ఒత్తిడి కలిగిస్తే చాలు, విరేచనం సులభంగా అవుతుంది. అయితే ఆ పాయింట్‌ను ఎలా గుర్తించాలంటే..
సరిగ్గా బొడ్డు కింద మీ చేతి మూడు వేళ్లను అడ్డంగా పెట్టి కొలవండి. వాటి కింద వచ్చే పాయింట్ నే సీ ఆఫ్ ఎనర్జీ పాయింట్ అని అంటారు. దానిపై 10 సెకండ్ల నుంచి 1 నిమిషాం పాటు సున్నితంగా మర్దనా చేయండి. కొద్దిగా ఒత్తిడి కలిగించండి. దీంతో విరేచనం వెంటనే వచ్చేస్తుంది. 5 నిమిషాల్లోపే కాలకృత్యాలు తీర్చేసుకుంటారు కూడా. అంతేకాదు, ఇలా చేయడం వల్ల పెద్ద పేగులో ఉన్న వ్యర్థాలు కూడా వెంటనే బయటకు వస్తాయి. స్త్రీలలో అయితే రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. ఇతరులకు గ్యాస్ సమస్యలు కూడా తీరుతాయి. అయితే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, వేళకు భోజనం చేయడం చేస్తే మలబద్దకం సమస్య మిమ్మల్ని బాధించదు.