Cough : గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా బ్యాక్టీరియాలు, వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. వీటి కారణంగా దగ్గు రావడం, కఫం, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తలెత్తూ ఉంటాయి. చాలా మంది ఈ సమస్యలు తలెత్తగానే యాంటీ బయాటిక్ లను, సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. ఇటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లను మనం కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. దగ్గు, గొంతు నొప్పి, కఫం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి.
అలాగే గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి గొంతులో పోసుకుని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా మనం దగ్గు, గొంతు నొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ లు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇటువంటి సమస్యల బారిన పడినప్పుడు వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి. అలాగే గొంతు నొప్పి, దగ్గు, కఫం, జలుబు వంటి సమస్యల బారిన పడినప్పుడు వేడి నీటిలో పసుపు వేసి తరచూ ఆవిరి పట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా సత్వర ఫలితం ఉంటుంది. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
కేవలం తేనె కలిపిన నీటిని, కొబ్బరి నీటిని తాగుతూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం చేయాలి. ఇలా ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అంతా బ్యాక్టీరియాల, వైరస్ లను నశింపజేయడంలో పని చేస్తుంది. దీంతో దగ్గు, కఫం సమస్యల నుండి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. అలాగే వేడి నీటితో రెండు పూటలా స్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీర బడలిక తగ్గి ఉపశమనం కలుగుతుంది. యాంటీ బయాటిక్ లను వాడడం వల్ల సమస్య తగ్గకపోగా వాటిని వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. దగ్గు సిరప్ ను వాడినప్పటికి దగ్గు మరలా వస్తూనే ఉంటుంది. తేనె నీటిని తాగుతూ ఉపవాసం చేయడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుండి చాలా త్వరగా బయటపడవచ్చు.