Strong Hair : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నేటి తరుణంలో అందరూ జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో వయసు పైబడిన తరువాత జుట్టు తెల్లబడేది కానీ ప్రస్తుత కాలంలో యువతలో కూడా జుట్టు తెల్లబడడాన్ని మనం గమనించవచ్చు. అలాగే జుట్టు చిట్లడం, జుట్టు నిర్జీవంగా మారడం, జుట్టు పొడిబారడం, జుట్టు తెలగిపోవడం, చుండ్రు వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిగిన షాంపులను, కండీష్ నర్ లను వాడడం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ రకాల కారణాల చేత జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జుట్టు సంబంధిత సమస్యల నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక నిరుత్సాహపడే వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడే అవసరం లేకుండా చిన్న చిట్కాను వాడి మనం జుట్టు సంబంధిత సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేయడం అలాగే వాడడం కూడా చాలా తేలిక. జుట్టును అందంగా, ఒత్తుగా మార్చే ఈ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం రసాయనాలు తక్కువగా ఉండే షాంపును, టీ పొడిని, ఉసిరికాయ పొడిని, కలబంద గుజ్జును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో మన జుట్టుకు అవసరమయ్యేంత షాంపును తీసుకోవాలి.
తరువాత ఇందులో అర టీ స్పూన్ టీ పొడిని కలపాలి. తరువాత ఒక టీ స్పూన్ ఉసిరికాయ పొడిని కలపాలి. చివరగా ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును కలపాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి. దీనిని పది నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా తయారవుతాయి. జుట్టు కుదుళ్లల్లో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు సమస్యలతో బాధపడే వారు వారానికి ఒకసారి ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.