Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

రెండు బెండ‌కాయ‌ల‌ను క‌ట్ చేసి నీటిలో ఉంచి ఇలా తీసుకుంటే షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Admin by Admin
April 10, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది బాధ‌ప‌డుతున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే తీవ్ర‌మైన వ్యాధిగా మారుతుంది. దీంతో అనేక దుష్ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి. డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచ‌డంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. డ‌యాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహార ప‌దార్థాల‌పైనే వారి ర‌క్తంలో చక్కెర స్థాయిలు ఆధార‌ప‌డి ఉంటాయి. ఇక ఆహారం విష‌యానికి వ‌స్తే డ‌యాబెటిస్ ఉన్న‌వారికి బెండ‌కాయ‌లు ఎంతో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

take okra in this way to control diabetes

బెండ‌కాయ‌ల్లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. బెండకాయ‌ల్లో యాంటీ హైప‌ర్ లిపిడెమిక్ గుణాలు కూడా ఉంటాయి. దీని వ‌ల్ల మ‌నం తినే ఆహారం నుంచి శ‌రీరం కొలెస్ట్రాల్‌ను శోషించుకోదు. దీంతో ర‌క్తంలో కొవ్వుల స్థాయిలు త‌గ్గుతాయి.

టైప్ 1 డ‌యాబెటిస్ వంశ పారంపర్యంగా వ‌స్తుంది. కానీ టైప్ 2 డ‌యాబెటిస్ అనేది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, రోజులో ఎక్కువ స‌మ‌యం పాటు కూర్చుని ఉండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంది. అలాగే చ‌క్కెర‌, పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్సులిన్ నిరోధ‌క‌త ఏర్ప‌డుతుంది. ఇది టైప్ 2 డ‌యాబెటిస్‌కు దారి తీస్తుంది. స్థూల‌కాయం కూడా వ‌స్తుంది.

అయితే అధిక బ‌రువు పెరిగినా, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నా కూడా ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. దీని వ‌ల్ల బీటా క‌ణాల ప‌నితీరు దెబ్బ తింటుంది. ఫ‌లితంగా డ‌యాబెటిస్ వ‌స్తుంది.

బెండ‌కాయ‌ల్లో ఫైటో కెమిక‌ల్స్ అధికంగా ఉంటాయి. పాలీ శాకరైడ్స్‌, పాలిఫినాల్స్‌, టానిన్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్‌, ట్రైటర్పీన్స్‌, స్టెరాల్స్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు, లిపిడ్ స్థాయిలు త‌గ్గుతాయి. బెండ‌కాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల బీటా క‌ణాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీంతో ఇన్సులిన్ ఉత్ప‌త్తికి ఆటంకం ఏర్ప‌డ‌దు. ఫ‌లితంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి.

1. బెండ‌కాయ‌ల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా త‌క్కువ‌. అది 20 మాత్ర‌మే. అంటే వీటిని తింటే ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా నెమ్మ‌దిగా పెరుగుతాయ‌న్న‌మాట‌. అందువ‌ల్ల వీటిని డ‌యాబెటిక్ ఫ్రెండ్లీ ఆహారం అని చెప్ప‌వ‌చ్చు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని త‌ర‌చూ తీసుకోవాలి.

2. డయాబెటిస్ వ‌ల్ల కిడ్నీ వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. చ‌క్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. క‌నుక కిడ్నీలు దెబ్బ తింటాయి. కానీ బెండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం త‌గ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

3. బెండ‌కాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ కార్బొహైడ్రేట్ల‌ను జీర్ణం చేయ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీటిల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు, షుగ‌ర్ లెవ‌ల్స్‌ను తగ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది.

డ‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే బెండ‌కాయ‌ల‌ను ఇలా వాడాలి

రెండు బెండ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. వాటిని పైన‌, కింద భాగాల్లో క‌ట్ చేయాలి. దీంతో బెండ‌కాయ‌ల నుంచి తెల్ల‌ని జిగురు వంటి ప‌దార్థం బ‌య‌ట‌కు వ‌స్తుంది. బెండ‌కాయ‌ల‌ను క‌డ‌గ‌రాదు. వాటిని అలాగే ఒక గ్లాస్ నీటిలో వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. గ్లాస్ మీద మూత పెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ నీటి నుంచి బెండ‌కాయ‌ల‌ను తీసేయాలి. అనంత‌రం ఆ నీటిని తాగాలి.

ఇలా రోజూ చేయ‌డంవ‌ల్ల షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. బెండ‌కాయ‌ల‌ను వండుకుని తిన‌డం కంటే ఇలా చేయ‌డం వ‌ల్లే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది. దీంతోపాటు వాటిల్లో ఉండే పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అయితే బెండ‌కాయ‌ల‌ను నాన‌బెట్టిన నీటిని రోజూ ఇలా తీసుకుంటూనే య‌థావిధిగా వాటితో కూర‌లు చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. కానీ ప‌చ్చిగా వాటిని అలా వాడితేనే ఎక్కువ‌గా, వేగంగా ఫ‌లితం వ‌స్తుంది.

ఇక బెండ‌కాయ‌ల‌ను ఎక్కువ‌గా తీసుకోరాదు. తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. విరేచ‌నాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. బెండ‌కాయ‌ల్లో ఆగ్జ‌లేట్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న‌వారు వీటిని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఇక బెండకాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: bendakayaDiabetesokrasugar levelsType 2 Diabetesటైప్ 2 డ‌యాబెటిస్డ‌యాబెటిస్బెండ‌కాయ‌మ‌ధుమేహంర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు
Previous Post

రాత్రి పూట ఆహారంలో వీటిని తీసుకోండి.. అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి..!

Next Post

ఫ్యాటీ లివర్‌ సమస్యను తగ్గించుకోవాలంటే.. ఇలా చేయాలి..!

Related Posts

చిట్కాలు

మునగాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..? తెలిస్తే వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..

July 20, 2025
చిట్కాలు

ఉల్లిపాయ‌ల‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది..

July 20, 2025
చిట్కాలు

2 రూపాయల విలువైన ఈ ఒక్క వస్తువు వల్ల మీ దంతక్షయం నశిస్తుంది..!

July 20, 2025
చిట్కాలు

మ‌జ్జిగ‌లో వీటిని క‌లిపి తాగండి.. మ‌ల‌బ‌ద్దకం అన్న మాటే ఉండ‌దు..!

July 13, 2025
చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

July 11, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.