Weight Loss Drink : మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు అధిక రక్తపోటు, డయాబెటిస్, బరువు పెరగడానికి దారి తీస్తున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
చెడు ఆహారపు అలవాట్లతో మన ఆరోగ్యాన్ని స్వయానా మనమే నాశనం చేసుకుంటున్నాం. దీనికి ఫలితంగా మానసిక ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల బారినపడుతున్నారు. రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఒత్తిడి, జీవనశైలి, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, హార్మోన్స్ లో అసమతుల్యత ఇలా ఎన్నో రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే మన బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బరువు తగ్గటానికి ప్రతి రోజు అరగంట అయినా వ్యాయామం చేయాలి. ఇప్పుడు చెప్పే పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వు కరగడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ పాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి వెలిగించి మందపాటి పాన్ పెట్టి దానిలో ఒక స్పూను వాము, నాలుగు యాలకులు, ఒక స్పూను సోపు గింజలు, అంగుళం దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన పదార్థాలు చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో ఒక స్పూన్ అశ్వగంధ పొడి, ఒక స్పూన్ శొంఠి పొడి, మూడు టీస్పూన్ల బాదం పొడి, ఒక స్పూను ఆర్గానిక్ పసుపు, రుచికి సరిపడా పటిక బెల్లం ముక్కలను వేసి మరలా ఈ మిశ్రమాన్ని మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజులపాటు నిల్వ ఉంటుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో పైన తయారు చేసిన అర టీస్పూన్ పొడిని వేసి బాగా కలిపి ఉదయం సమయంలో త్రాగటం ద్వారా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు క్రమంగా కరిగి బరువు తగ్గుతారు. మోకాళ్ళ నొప్పులు తగ్గి ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ పాలను రాత్రి సమయంలో తాగితే హాయిగా నిద్ర పడుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కనుక ఈ పొడిని పాలతో రోజూ తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.