Teeth White : గార పట్టిన దంతాలను తెల్లగా మార్చడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దంతాలు గార పట్టడానికి అనేక కారణాలు ఉంటాయి. శీతల పానీయాలను, టీ, కాఫీలను అధికంగా తాగడం, పొగాకు ఉత్పత్తులను నమలడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వల్ల దంతాలు గార పడతాయి. ఈ సమస్య కారణంగా బాధపడే వారు నలుగురిలో సరిగ్గా మాట్లాడలేరు. చక్కగా నవ్వలేరు. అయితే చాలా తక్కువ ఖర్చుతోనే చాలా తక్కువ సమయంలో దంతాలకు పట్టిన గారను మనం తొలగించుకోవచ్చు.
దంతాలను తెల్లగా మార్చే ఆ చిట్కా ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దంతాలను తెల్లగా మార్చుకోవడానికి మనం ఒక అరటి పండును, కొద్దిగా ఉప్పును, పావు టీ స్పూన్ పసుపును, టూత్ పేస్ట్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అరటి పండును తీసుకుని తొక్కను వేరు చేయాలి. ఇప్పుడు ఆ తొక్కను తీసుకుని ఆ తొక్క లోపలి వైపు తెల్లగా ఉండే పదార్థాన్ని స్పూన్ సహాయంతో తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పును, పావు టీ స్పూన్ పసుపును, మనం ఉపయోటించే టూత్ పేస్ట్ ను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని టూత్ పేస్ట్ లా మెత్తగా చేసుకోవాలి.
ఇలా తయారు చేసిన మిశ్రమంతో రోజూ ఉదయం, రాత్రి పూట కనీసం 3 నిమిషాల పాటు దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలకు పట్టిన గార తొలగిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే దంతాలు తెల్లగా మిలమిలా మెరుస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. అలాగే నోట్లో ఉన్న బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇలా ఈ మిశ్రమంతో దంతాలు, చిగుళ్లు, నోటి సమస్యల నుంచి బయట పడవచ్చు.