వేగంగా మారుతున్న నగర జీవనం, జీవన విధానాలు, ఒత్తిడి, అలసట, మానసిక సమస్యలు వంటివన్ని పురుషుడ్ని నిర్వీర్యుడ్ని చేస్తున్నాయి. వివాహమై నాలుగేళ్లు లేదా అయిదేళ్ళు అయినప్పటికి జంటలు సంతానం పొందలేకపోతున్నారు. మరి పురుషులలో ఈ రకమైన పునరుత్పత్తి సమస్యను అధిగమించటానికి సింగపూర్ లోని ఒక యూరాలజిస్టు కొన్ని చిట్కాలు సూచిస్తున్నాడు.
ఈ పరిశోధకుడి మేరకు పురుషులు ప్రతి మూడు రోజులకు ఒకసారి అరటిపండు తినాలని అరటిపండులో మెగ్నీషియం స్ధాయి అధికమని, ఇది వీర్యకణాలను అధికంగా తయారు చేస్తుందని స్టార్ ఆన్ లైన్ ప్రసారం చేసినట్లు సిన్ చ్యూ డైలీ పత్రిక ప్రచురించింది. ఆహారంలో జీడిపప్పు, బంగాళదుంప, సముద్రపు ఆహారాలు వంటి వాటిలో కూడా ఇదే మాదిరి మెగ్నీషియం వుందని కనుక ఈ ఆహారాలు తీసుకుంటే పురుషులకు మేలు జరుగుతుందని కూడా ఆయన తెలిపారు.
పిల్లలు పుట్టాలనుకునే పురుషులు ఆల్కహాల్ తాగటం, స్మోకింగ్ చేయటం, వేడినీటి స్నానంలేదా సౌనా బాత్ వంటివి పురుషులలో వీర్య కణాలను బలహీనపరుస్తాయని కనుక వీరు తక్షణం ఇటువంటి పనులు చేయరాదని తెలిపాడు.