చిట్కాలు

హైబీపీ, షుగ‌ర్‌ను త‌గ్గించే 3 ర‌కాలు ఆకులు.. ఇలా తీసుకోవాలి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్ర‌జ‌లు హైబీపీ, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ రెండూ కొంద‌రికి కంబైన్డ్‌గా ఉంటాయి. కొంద‌రికి ఒక్కో వ్యాధి మాత్ర‌మే ఉంటుంది. అయితే ఈ రెండింటి వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హైబీపీ, షుగ‌ర్ అదుపులో లేక‌పోతే తీవ్ర‌మైన దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయి. అందువ‌ల్ల ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవాలి. అందుకుగాను కింద తెలిపిన 3 రకాల ఆకులు బాగా ప‌నిచేస్తాయి. మ‌రి ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

these 3 types of leaves reduce high bp and sugar

1. టైప్ 2 డ‌యాబెటిస్‌ను త‌గ్గించ‌డంలో తుల‌సి ఆకులు బాగా ప‌నిచేస్తాయి. అలాగే ఇవి హైబీపీని కూడా త‌గ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తుల‌సి ఆకుల ర‌సాన్ని తాగుతుండాలి. దీంతో హైబీపీ, షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు.

2. క‌రివేపాకుల‌ను ఎంతో మంది రోజూ వంట‌ల్లో వేస్తుంటారు. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 10 ఆకుల చొప్పున తింటుండాలి. షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బీపీ అదుపులో ఉంటుంది.

3. వేపాకులు కూడా డ‌యాబెటిస్, హైబీపీని త‌గ్గించ‌డంలో అద్బుతంగా ప‌నిచేస్తాయి. వీటిని కూడా ఉద‌యాన్నే 4-5 చొప్పున ప‌ర‌గడుపునే తింటుండాలి. దీంతో షుగ‌ర్‌, బీపీ దెబ్బ‌కు అదుపులోకి వ‌స్తాయి.

తుల‌సి, క‌రివేపాకులు, వేపాకులు.. మూడింటినీ స‌మాన భాగాల్లో తీసుకుని దంచి మిశ్ర‌మంగా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని బ‌ఠానీ గింజ‌లంత ట్యాబ్లెట్లుగా త‌యారు చేసుకోవాలి. రోజూ ఈ ట్యాబ్లెట్ల‌ను ఉద‌యం, సాయంత్రం 1 ట్యాబ్లెట్ చొప్పున భోజ‌నానికి ముందు తీసుకోవాలి. ఇలా చేసినా హైబీపీ, షుగ‌ర్ త‌గ్గుతాయి.

Admin

Recent Posts