సాధారణంగా మనలో అధిక శాతం మందికి అప్పుడప్పుడు గొంతు నొప్పి వస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. జలుబు చేసినప్పుడు లేదా చల్లని ద్రవాలను ఎక్కువగా తాగినప్పుడు లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా గొంతు నొప్పి వస్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే గొంతు నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు.
* గొంతు నొప్పి ఎక్కువగా ఉన్నవారు.. ఓ బౌల్‌లో వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. చికెన్ సూప్ శ్వాసకోశ సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు.. జలుబు కూడా తగ్గుతుంది.
* లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలను వేసి.. వేడిగా మసాలా టీ తయారు చేసుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం ముక్కలను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో చిక్కని అల్లం రసం వస్తుంది. అప్పుడు ఆ రసాన్ని వడకట్టి వేడిగా ఉండగానే తాగాలి. దీంతో గొంతు నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెలను కలుపుకుని తాగాలి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు గొంతు నొప్పిని క్షణాల్లో తగ్గిస్తాయి.
* మిరియాలతో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మరిగించిన పాలను తాగుతుంటే గొంతు నొప్పి తగ్గుతుంది.
* గొంతు నొప్పి సమస్యలకు యాపిల్ సైడర్ వెనిగర్‌ను కూడా వాడవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365