Underarms Darkness : మనలో చాలా మందికి చంక భాగంలో నల్లగా ఉంటుంది. శరీరమంతా తెల్లగా ఉన్నప్పటికి చంక భాగంలో మాత్రం నల్లగా ఉంటుంది. చంక భాగంలో చర్మం నల్లగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, రేజర్లను ఉపయోగించడం, హార్మోన్ల అసమతుల్యత, రసాయనాలు కలిగిన డియోడ్రెంట్ లను ఎక్కువగా ఉపయోగించడం, ఆ భాగంలో సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, మృతకణాలు, మురికి పేరుకుపోవడం వంటి వివిధ కారణాల చేత చంక భాగంలో చర్మం నల్లగా మారుతుంది. దీంతో చాలా నచ్చిన బట్టలు వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా సులభంగా చంక భాగంలో పేరుకుపోయిన నలుపును తొలగించుకోవచ్చు. చంక భాగంలో పేరుకుపోయిన నలుపును తొలగించే ఈ చిట్కాలు ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ బంగాళాదుంప రసం, ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ వంటసోడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చంక భాగంలో చర్మంపై రాసి మర్దనా చేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వంటసోడా ఉపయోగిస్తే ఈ చిట్కాను వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. అదే వంటసోడా ఉపయోగించకపోతే ఈ చిట్కాను వారానికి మూడు నుండి నాలుగు సార్లు ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఈ చిట్కాను ఉపయోగించడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు చాలా త్వరగా తొలగిపోతుంది. దీనిని వాడిన మొదటి సారే మనం చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా చంక భాగంలో నలుపు తొలగించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల పంచదార, 2 టీ స్పూన్ల పెరుగు వేసి కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని చంక భాగంలో రాస్తూ మర్దనా చేయాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు, మృతకణాలు, మురికి తొలగిపోయి ఆ భాగంలో చర్మం తెల్లగా మారుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా చంక భాగంలో నలుపును తొలగించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి అర కప్పు గ్రీన్ టీ ని, సగం బంగాళాదుంపను, సగం కీరదోసను, ఒక కప్పు కొత్తిమీరను, ఒక నిమ్మకాయను, ఒక టీ స్పూన్ పసుపును, ఒక కప్పు సొరకాయ ముక్కలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా జార్ లో బంగాళాదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే నిమ్మకాయను పొట్టుతో సహా ముక్కలుగా చేసి వేసుకోవాలి.
ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా జ్యూస్ లాగా చేసుకోవాలి. తరువాత ఇందులో గ్రీన్ టీ, పసుపు వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నేరుగా మనం చంక భాగంలో రాసుకోవచ్చు లేదా ఈ మిశ్రమంలో శనగపిండి, బియ్యం పిండి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చంక భాగంలో రాసుకుని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చంక భాగంలో పేరుకుపోయిన నలుపు తొలగిపోయి చర్మం తెల్లగా మారుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా చంక భాగంలో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలను మెడ, మోచేతులు, మోకాళ్లు, నల్లగా ఉన్న వేళ్ల పై కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం మనం చాలా సులభంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.