Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Underarms Darkness : చంక‌ల్లో ఉండే న‌లుపుద‌నాన్ని పోగొట్టే అద్భుత‌మైన చిట్కాలు.. ఇలా చేయాలి..!

D by D
March 17, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Underarms Darkness : మ‌న‌లో చాలా మందికి చంక భాగంలో న‌ల్ల‌గా ఉంటుంది. శ‌రీర‌మంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి చంక భాగంలో మాత్రం న‌ల్ల‌గా ఉంటుంది. చంక భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, రేజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, ర‌సాయ‌నాలు క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం, ఆ భాగంలో స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, మృత‌క‌ణాలు, మురికి పేరుకుపోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత చంక భాగంలో చ‌ర్మం నల్ల‌గా మారుతుంది. దీంతో చాలా న‌చ్చిన బట్ట‌లు వేసుకోలేక ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. కొన్ని ర‌కాల ఇంటి చిట్కాల‌ను ఉప‌యోగించి మ‌నం చాలా సుల‌భంగా చంక భాగంలో పేరుకుపోయిన న‌లుపును తొల‌గించుకోవ‌చ్చు. చంక భాగంలో పేరుకుపోయిన న‌లుపును తొల‌గించే ఈ చిట్కాలు ఏమిటి.. వీటిని ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల మైదాపిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టీ స్పూన్ బంగాళాదుంప ర‌సం, ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ తేనె, అర టీ స్పూన్ వంట‌సోడా వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చంక భాగంలో చ‌ర్మంపై రాసి మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వంట‌సోడా ఉప‌యోగిస్తే ఈ చిట్కాను వారానికి ఒక‌సారి మాత్ర‌మే ఉప‌యోగించాలి. అదే వంట‌సోడా ఉప‌యోగించ‌క‌పోతే ఈ చిట్కాను వారానికి మూడు నుండి నాలుగు సార్లు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ విధంగా ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల చంక భాగంలో పేరుకుపోయిన న‌లుపు చాలా త్వ‌ర‌గా తొల‌గిపోతుంది. దీనిని వాడిన మొద‌టి సారే మ‌నం చ‌క్క‌టి ఫ‌లితాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అదే విధంగా చంక భాగంలో న‌లుపు తొల‌గించే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ ప‌సుపు, రెండు టీ స్పూన్ల పంచ‌దార‌, 2 టీ స్పూన్ల పెరుగు వేసి క‌ల‌పాలి.

Underarms Darkness home remedies what to do
Underarms Darkness

త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని చంక భాగంలో రాస్తూ మ‌ర్ద‌నా చేయాలి. ఆరిన త‌రువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చంక భాగంలో పేరుకుపోయిన న‌లుపు, మృత‌క‌ణాలు, మురికి తొల‌గిపోయి ఆ భాగంలో చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా చంక భాగంలో నలుపును తొల‌గించే మ‌రో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి అర కప్పు గ్రీన్ టీ ని, స‌గం బంగాళాదుంప‌ను, స‌గం కీర‌దోస‌ను, ఒక క‌ప్పు కొత్తిమీర‌ను, ఒక నిమ్మ‌కాయ‌ను, ఒక టీ స్పూన్ ప‌సుపును, ఒక క‌ప్పు సొర‌కాయ ముక్క‌ల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా జార్ లో బంగాళాదుంప ముక్క‌లు, సొర‌కాయ ముక్క‌లు, కీర‌దోస ముక్క‌లు, కొత్తిమీర‌ను వేసుకోవాలి. అలాగే నిమ్మ‌కాయ‌ను పొట్టుతో స‌హా ముక్క‌లుగా చేసి వేసుకోవాలి.

ఇప్పుడు వీట‌న్నింటిని మెత్త‌గా జ్యూస్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఇందులో గ్రీన్ టీ, ప‌సుపు వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని మ‌నం నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మాన్ని నేరుగా మ‌నం చంక భాగంలో రాసుకోవ‌చ్చు లేదా ఈ మిశ్ర‌మంలో శ‌న‌గ‌పిండి, బియ్యం పిండి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని చంక భాగంలో రాసుకుని ఆరిన త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చంక భాగంలో పేరుకుపోయిన న‌లుపు తొల‌గిపోయి చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా చంక భాగంలో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను మెడ‌, మోచేతులు, మోకాళ్లు, న‌ల్ల‌గా ఉన్న వేళ్ల పై కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌ను వాడ‌డం మ‌నం చాలా సుల‌భంగా చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు.

Tags: Underarms Darkness
Previous Post

Gulab Jamun Ice Cream : గులాబ్ జామున్‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Next Post

White Chitrannam : క‌ర్ణాట‌క స్పెష‌ల్‌.. వైట్ చిత్రాన్నం.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.