Eye Sight : ప్రస్తుత కాంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలల్లో కంటి సంబంధమైన సమస్యలు కూడా ఒకటి. కంటి చూపు మందగించడం, కంటిలో పొరలు రావడం, కళ్లు మసకగా కనబడడం వంటి వాటిని మనం కంటి సమస్యలుగా చెప్పవచ్చు. ఈ సమస్యలన్నింటి నుండి ఆయుర్వేదం ద్వారా మనం బయటపడవచ్చు. ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు కలిగిన మొక్కను ఉపయోగించి మనం కంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ మొక్కే రెడ్డి వారి నానుబాలు మొక్క. దీనిని పాలకాడ, నాగార్జున అని కూడా పిలుస్తుంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగులతోపాటు చిన్నది, పెద్దది అని రెండు రకాలుగా ఉంటాయి.
వర్షాకాలంలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్క తీపి, కారం, చేదు రుచులను కలిగి ఉంటుంది. కంటి సమస్యలను తగ్గించడంలో రెడ్డి వారి నానుబాలు మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మొక్కను తుంచగా వచ్చిన పాలను కంటిలో వేసుకుంటూ ఉంటే కంటి పొరలు, కంటిమసకలు తొలగిపోయి సహజమైన దృష్టి వస్తుంది. కంటిలో పుల్లలు గుచ్చుకుని పోయిన కంటి చూపును మరలా వచ్చేలా చేసే శక్తి కూడా ఈ మొక్కకు ఉంటుంది. పైత్య శరీర తత్వం ఉన్న వారు ఈ మొక్క పాలను కంటిలో వేయగానే కళ్లు ఎర్రగా మారుతాయి. కానీ భయపడాల్సిన పని లేదు. అలాంటి వారు రోజూ కాకుండా అప్పుడప్పుడు ఈ మొక్క పాలను కళ్లల్లో వేసుకుంటూ ఉండాలి.
ఈ మొక్కను ఉపయోగించి కంటి సమస్యలతోపాటు మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో సంతాన లేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. స్త్రీ, పురుషులిద్దరిలో వచ్చే సంతాన లేమి సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని ఎండబెట్టి పొడిలా చేసి జల్లించాలి. దీనికి సమపాళ్లల్లో పటిక బెల్లం చూర్ణాన్ని కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ చొప్పున నీటిలో కలిపి తీసుకుంటూ ఉండాలి. వెంటనే ఆవు పాలలో పటిక బెల్లాన్ని వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల స్త్రీలలో వచ్చే గర్భాశయ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతోపాటు సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.
ఈ విధంగా ఈ మొక్కను ఉపయోగించడం వల్ల స్త్రీలలో గర్భాశయంలో, రొమ్ములల్లో గడ్డలు రావు. అండాశయంలో వచ్చే నీటి బుడగలు రాకుండా ఉంటాయి. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు కూడా వారి దరి చేరకుండా ఉంటాయి. ఇదే పద్దతిలో పురుషులు కూడా ఈ మొక్కను ఉపయోగించడం వల్ల శీఘ్రస్కలనం, నపుంసకత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్యతోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఈ మొక్కను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని నీడలో ఎండబెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. షుగర్ వ్యాధి తీవ్రతను బట్టి 5 నుండి 10 గ్రాముల మోతాదులో రెండుపూటలా భోజనానికి అర గంట ముందు నీటిలో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. భవిష్యత్తులో ఈ వ్యాధి రాకుండా ఉంటుంది.