White To Black Hair : ఇంతకు ముందు రోజుల్లో అంటే వృద్ధాప్యం వచ్చాకే జుట్టు తెల్లబడేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారికి సైతం.. ఆ మాటకొస్తే కొందరు పిల్లల్లోనూ జుట్టు తెల్లబడుతోంది. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఇలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడితే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. దీని నుంచి బయట పడేందుకు మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, డై లను వాడుతుంటారు. కానీ అవన్నీ తాత్కాలికంగా మాత్రమే జుట్టును నల్లబరుస్తాయి. అయితే కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటిస్తే దాంతో మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు చిక్కగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. అందుకు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్లబడిన వెంట్రుకలను నల్లగా మార్చేందుకు బ్లాక్ టీ ఎంతగానో దోహదపడుతుంది. పాలు కలపకుండా టీ పొడితో డికాషన్ తయారు చేయాలి. దీన్నే బ్లాక్ టీ అంటారు. ఇందులో కాస్త ఉప్పు వేసి వేడి చేసి దాన్ని తలకు పట్టించాలి. తరువాత అరగంట సేపు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తే చాలు మీ జుట్టు నల్లగా మారుతుంది. తెల్లదనం పోతుంది.
ఉసిరికాయలు కలిపిన కొబ్బరినూనెను రోజూ రాసుకుంటే తెల్ల వెంట్రుకల సమస్యే ఉండదు. ఎండిన ఉసిరికాయలను కొబ్బరినూనెలో వేసి కాసేపు వేడి చేయండి. ఆ తరువాత రాత్రంతా దాన్ని అలాగే వదిలేయండి. ఉదయం లేచిన తరువాత ఆ నూనెను తలకు రాయండి. తరువాత కాసేపు ఆగి తలస్నానం చేయండి. ఇలా తరచూ చేస్తుంటే ఫలితం ఉంటుంది.
చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు గోరింటాకు పొడి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకు గాను గోరింటాకు పొడి లేదా హెన్నాలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపండి. వాటిని సుమారు 15 నిమిషాలు ఉడికించండి. రాత్రంతా ఆ మిశ్రమాన్ని అలాగే వదిలిపెట్టి ఉదయం తలకు రాసుకోండి. 3 గంటల తరువాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. దీంతో కెమికల్స్ వాడే బాధ తప్పుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది.