Dandruff : వర్షాకాలంలో సహజంగానే మన జుట్టు కుదుళ్లు చాలా బలహీనంగా మారుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. వర్షాకాలంలో చర్మంతోపాటు తలపై ఉండే స్కాల్ప్ కూడా పొడిగా అవుతుంది. దీంతో దురద ఎక్కువగా వస్తుంది. దీని వల్ల తెల్లని పొట్టు బయటకు వస్తుంది. ఇది చుండ్రులా కనిపిస్తుంది. అయితే చుండ్రు సమస్య వస్తే ఒక పట్టాన తగ్గదు. దీన్ని వదిలించుకునేందుకు చాలా మంది అనేక రకాల చిట్కాలను పాటిస్తుంటారు. కానీ అవేవీ పనిచేయక విసిగిపోతుంటారు. అయితే కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. దాంతో చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెనిగర్, నీటిని సమపాళ్ళలో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. పెరుగు పులిసిందని పడేయకుండా తలకు ఉపయోగించుకోవచ్చు. పుల్లటి పెరుగును తలకు అప్లై చేయాలి. 2 గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీంతో చుండ్రు నుంచి బయట పడవచ్చు. అంతేకాదు జట్టు కూడా మెరుస్తుంది. అలాగే రెండు టీస్పూన్ల మెంతులను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు వాటిని పిండిగా చేసి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల శిరోజాలకు తగిన పోషణ అందుతుంది. దీంతోపాటు చుండ్రు కూడా తగ్గుతుంది.
బియ్యం నానబెట్టిన నీటిని పారబోయకుండా జుట్టుని ఈ నీటితో శుభ్రపరుచుకోవాలి. అనంతరం తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య చాలా మేరకు తగ్గుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్ జుట్టులోని పొడితనాన్ని, చుండ్రునీ తొలిలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని జుట్టుకి పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత జుట్టుని టవల్‌తో చుట్టుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు నుంచి శాశ్వతంగా బయట పడవచ్చు. దీంతోపాటు జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.