Aloe Vera : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కంటి చూపు మందగించడం అనే సమస్యతో బాధపడుతున్నారు. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే భూతద్దాల వంటి కళ్లజోడులను పెట్టుకునే పిల్లలను మనం చూస్తూనే ఉన్నాం. కంటిచూపు మందగించడానికి అనేక కారణాలు ఉంటాయి. గంటల తరబడి సెల్ ఫోన్ లలో, కంప్యూటర్ లలో చిన్న చిన్న అక్షరాలను చూస్తూ ఉండడం వల్ల, సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల కంటి చూపు తగ్గుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు మనకు కంటి అద్దాలను కానీ, కాంటాక్ట్ లెన్సులను కానీ సూచిస్తారు. వీటిని ఉపయోగించే పనిలేకుండా ఆయుర్వేదం ద్వారా మనం ఈ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.
కంటిచూపు మందగించిన వారు ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల కంటిచూపు మెరుగుపడి కళ్లద్దాలను ఉపయోగించే అవసరం ఉండదు. కంటిచూపును మెరుగుపరిచే ఆ ఔషధం ఏమిటి.. దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కంటిచూపును మెరుగుపరచడంలో మనకు కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద మనందరికీ తెలుసు. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. కంటిచూపును మెరుగుపరచడానికి కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం ముందుగా చిల్ల గింజలను తీసుకుని వాటిని శుభ్రమైన తడిలేని మట్టిపాత్రలో ఉంచాలి. ఈ గింజలు మునిగే వరకు అందులో కలబంద గుజ్జు రసాన్ని పోయాలి. ఈ పాత్రను కదిలించకుండా బాగా గాలి తగిలే ప్రదేశంలో ఏడు నుండి పది రోజుల పాటు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ రసం అయిపోయినప్పుడల్లా రసాన్ని పోస్తూ ఉండాలి. పాత్రకు నీరు తగలకుండా కూడా చూసుకోవాలి. పది రోజుల తరువాత ఈ చిల్ల గింజలను తీసి తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. తరువాత వీటిని ఎండలో దుమ్ము పడని చోట ఉంచి బాగా ఎండబెట్టి వాటిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజను ఒక దానిని తీసుకుని నీటితో కానీ ఒక చుక్క ఆవు నెయ్యితో కానీ మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పెసరగింజంత పరిమాణంలో తీసుకుని కళ్లల్లో పెట్టుకుని నిద్రపోవాలి. ఈ మిశ్రమాన్ని పెట్టుకున్న వెంటనే కళ్లు మంట పుట్టడం సహజం. ఉదయాన్నే కళ్లను చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి.
ఇలా రెండు వారాల పాటు చేయడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. కేవలం కంటి చూపునే కాకుండా ఇతర కంటి సమస్యలను నయం చేయడంలో కూడా కలబంద మనకు సహాయపడుతుంది. కళ్ల కలకతో బాధపడే వారు 5 గ్రాముల కలబంద గుజ్జును, ఒక గ్రాము పటిక బెల్లం పొడిని తీసుకుని వాటి రెండింటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని నూలు వస్త్రానికి పట్టించి కళ్లు మూసూకుని కళ్లపై ఉంచాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల కళ్లకలకతోపాటు కళ్ల ఎరుపు, కంటికి దెబ్బ తగలడం వల్ల కలిగే వాపు కూడా తగ్గుతాయి.
కలబందను ఉపయోగించి మరో విధంగా కూడా మనం కళ్లకలక సమస్య నుండి బయట పడవచ్చు. కాలి బొటన వేలుకు సరిపడినంత కలబందను గుజ్జును తీసుకుని దానిపై పసుపును చల్లాలి. ఇలా పసుపు చల్లిన కలబంద గుజ్జును కాలిబొటన వేలు అడుగు భాగంలో ఉంచి ఊడిపోకుండా కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కళ్లకలక సమస్య తగ్గుతుంది. కంటిపోటుతో బాధపడే వారు కలబంద గుజ్జును వస్త్రంలో వేసి రసాన్ని పిండాలి. ఈ రసాన్ని 2 చుక్కల మోతాదులో రెండు చెవుల్లో వేయడం వల్ల ఎంతటి తీవ్రమైన కంటిపోటు అయినా సరే తగ్గిపోతుంది. ఈ విధంగా కలబందను ఉపయోగించి మనం కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన తెలిపిన చిట్కాలను పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.