దోమలు… ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ కాలంలోనైనా దోమలు ఇప్పుడు మనల్ని ఎక్కువగా బాధిస్తున్నాయి. ఇవి కుట్టడం వల్ల విష జ్వరాల బారిన పడి వేలకు వేల రూపాయలను హాస్పిటల్స్‌లో వదిలించుకుంటున్నాం. అయితే దోమలను చంపేందుకు చాలా మంది మస్కిటో కాయిల్స్, రీపెల్లెంట్స్ వంటివి వాడుతున్నారు. కానీ… అవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. వాటి వల్ల మనకు క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. మరి… దోమలను తరిమేందుకు ఎలాంటి మార్గాలు లేవా..? అంటే… అందుకు ఈ మొక్కలు పరిష్కారం చూపుతున్నాయి. ఇవి అలాంటి ఇలాంటి మొక్కలు కాదు, మాంసాహార మొక్కలు. తమ వద్దకు దోమలనే కాదు, ఇతర పురుగులను ఇవి ఆకర్షిస్తాయి. అనంతరం దగ్గరకు రాగానే వాటిని అమాంతం మింగేస్తాయి. దీంతో మనకు దోమలు, ఇతర పురుగుల బాధ తప్పుతుంది. ఇంతకీ… ఆ మొక్కలు ఏంటో తెలుసా..?
బటర్‌వోర్ట్ (Butterwort)… ఈ మొక్కకు తేమ ఉన్న వాతావరణం అవసరం. దీన్ని కొంత సూర్యకాంతి తగిలేలా కిటికీలు, వరండాలు, గోడల వద్ద ఉంచాలి. అప్పుడప్పుడు కొంత నీరు పోస్తే చాలు, ఇవి దోమలను ఆకర్షించి వాటిని తినేస్తాయి. అవే వాటికి ఆహారం. పిచర్ ప్లాంట్ (Pitcher Plant)… వీటిని సూర్యకాంతి తగలని ప్రదేశంలో ఉంచాలి. నీటిని తరచూ పోస్తుండాలి. ఇవి దోమలనే కాదు, పురుగులను ఆకర్షించి వాటిని ట్రాప్ చేసి తింటాయి.
వీనస్ ఫ్లై ట్రాప్ (Venus Flytrap)… ఈ మొక్కలకు నీరు అంతగా అవసరం లేదు. రెండు రోజులకు ఒకసారి నీటిని పోస్తే చాలు. ఇవి తమ వద్దకు వచ్చే దోమలను అమాంతం మింగేస్తాయి. సరసేనియా (Sarasenia)… తేమతో కూడిన వాతావరణంలో ఈ మొక్కలను ఉంచాలి. ఇవి కూడా దోమలను, పురుగులను ఆకర్షించి, వాటిని ట్రాప్ చేసి తింటాయి.
డచ్‌మ్యాన్స్ పైప్ (Dutchman’s Pipe)… వీటికి నీరు పెద్దగా అవసరం లేదు. రెండు రోజులకు ఒకసారి పోసినా చాలు. దోమలను ఆకర్షించి తినేస్తాయి.