ఏ దేశ కరెన్సీలో అయిన….నోట్లు మరియు కాయిన్స్ ( నాణాలు) ఉంటాయనేది అందరికీ తెల్సిన విషయమే.! అయితే ఇండియాలో నాణాలను ముద్రించే పనిని SPMCIL( సెక్యురిటి ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అనే ప్రభుత్వ సంస్థ చూసుకుంటుంది. దేశంలో 4 ప్రాంతాలలోని తమ ముద్రణా సంస్థలనుండి SPMCIL కాయిన్స్ ను అచ్చువేయిస్తుంది. అవి: 1) ముంబాయ్. 2) హైద్రాబాద్ 3) కలకత్తా 4) నోయిడా…లలో ఉన్నాయి. అయితే కాయిన్స్ కిందున్న గుర్తులను బట్టి…ఆ కాయిన్ ఎక్కడ ముద్రించారో తెలుసుకోవొచ్చు, అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ముంబాయ్ లో ముద్రించిన కాయిన్. కాయిన్ ముద్రించబడిన సంవత్సరం కింద డైమండ్ గుర్తు ఉంటే ..సదరు నాణెం ముంబాయ్ లో అచ్చువేయబడ్డట్టు.! 1829 నుండి ముంబాయి లో నాణాలు అచ్చువేయబడుతున్నాయి. హైద్రాబాద్ లో ముద్రించిన కాయిన్…. కాయిన్ ముద్రించబడిన సంవత్సరం కింద స్టార్ మార్క్ లేదా…డైమండ్ ఆకారం మద్యలో చుక్క గుర్తు ఉంటే…సదరు నాణెం హైద్రాబాద్ లో అచ్చువేయబడ్డట్టు.! 1903 నుండి హైద్రాబాద్లో నాణాలు అచ్చువేయబడుతున్నాయి.
నోయిడా లో ముద్రించిన కాయిన్.. కాయిన్ ముద్రించబడిన సంవత్సరం కింద డాట్ మార్క్( చుక్క గుర్తు) ఉంటే…సదరు నాణెం నోయిడా లో అచ్చువేయబడ్డట్టు.! 1984 నుండి నోయిడా లో నాణాలు అచ్చువేయబడుతున్నాయి. కలకత్తా లో ముద్రించిన కాయిన్….. కాయిన్ ముద్రించబడిన సంవత్సరం కింద ఎటువంటి గుర్తు లేకపోతే ..సదరు నాణెం కలకత్తాలో అచ్చువేయబడ్డట్టు.! 1757 నుండి కలకత్తా లో నాణాలు అచ్చువేయబడుతున్నాయి.