ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తప్పక కారు ఉంటుంది. కారులో కొందరు రెగ్యులర్‌గా ప్రయాణిస్తూ ఉంటారు. మరి కొందరు అప్పుడప్పుడు షికార్లు వేస్తుంటారు. అయితే పెట్రోల్, డీజిల్ ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో మైలేజ్ అనేది మనకు చాలా ముఖ్యం. కొత్తగా డ్రైవ్ చేసేవాళ్లు కారు టిప్స్ గురించి తెలియకపోవడం వలన మైలేజ్ తక్కువ వస్తుంటుంది. అందుకే కారు మైలేజ్ ఎక్కువగా ఇవ్వాలని కోరుకునేవారికి ఈ టిప్స్ తప్పక తెలియాలి. చాలా మంది కార్లో విపరీతమైన వేగంతో వెళుతుంటారు. ఇంకొందరు స్లోగా వెళతారు. అలా చేయడం వలన ఇంధనం ఖర్చు పెరుగుతుంది. ప్రయాణించేటప్పుడు ఒక స్థిరమైన వేగాన్ని పాటించాలి. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, ఓపెన్ రోడ్లపై వెళుతున్నప్పుడు, వీలైనప్పుడల్లా క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించాలి.
కారు మైలేజీని పెంచుకోవడానికి కారును జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కారును మురికి, అడ్డుపడే ఫిల్టర్‌లతో డ్రైవ్ చేస్తే.. ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుందని గుర్తించాలి. ఇంజిన్‌లో మురికి, గాలి వడపోత గాలి ప్రవాహాన్ని నిరోధిస్తుంది. దాంతో ఇంధనం అవసరమైనది కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.మీరు ప్రయాణం చేసేటప్పుడు, మీ వాహనంలో ఏవైనా బరువైన, అవసరం లేని వస్తువులుంటే, వాటిని తీసేయాలి. హైవేలపై వెళ్లేటప్పుడు అవసరం లేకపోతే విండోస్, రూఫ్‌టాప్‌లను క్లోజ్ చేయాలి. టైర్లలో ఎప్పుడూ సరిపడా గాలి ఉండేలా చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు మీ కారు టైర్ల ప్రెజర్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి.ఇంజిన్ అందించే మైలేజీకి నేరుగా సంబంధం ఉన్నది ఒక్కటే ఇంజిన్ ఆయిల్.. మీరు సరైన ఇంజిన్ ఆయిల్ గ్రేడ్‌ని ఉపయోగిస్తున్నారా? లేదా చెక్ చేసుకోండి.
కారు పార్కింగ్‌లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్‌లో వెయిట్ చేస్తున్నప్పుడు ఇంజిన్‌ను ఆఫ్ చేసుకోవాలి. ఇంజిన్ ఆన్‌లో ఉంచుకోవడం వల్ల అనవసరంగా ఫ్యూయెల్ ఖర్చయిపోతుంది. పైగా కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి. కారు ఎక్సలేటర్‌ను వేగంగా పెడలింగ్ చేయడంవల్ల మైలేజ్ తగ్గుతుంది. హెచ్చు, తగ్గులు ఎక్కువగా ఉండడంవల్ల మైలేజ్ వ్యవస్థ దెబ్బతింటుంది. డ్రైవింగ్ కామన్‌గా ఉండటంవల్ల మంచి మైలేజ్ వస్తుంది. కారు టైర్లు బాగా లేకపోవడం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. తరచూ అనవసరంగా బ్రేక్స్ వేయకూడదు. బ్రేక్ వేయడం వల్ల కూడా ఇంధనం ఖర్చు అవుతుంది. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇతర వాహనాలకు వీలైనంత దూరంగా ఉంటే సడెన్ బ్రేక్స్ వేసే అవసరం ఉండదు. దీంతో మైలేజ్‌ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది.