Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

ఎవరికైనా ఫోన్ చేస్తే ‘జాగ్రత్తగా ఉండండి..’ అనే యాడ్ వినిపిస్తోందా? దీన్ని ఇలా కట్ చేయండి..!

Admin by Admin
March 16, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.. ఈ మ్యాటర్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా.. ఇటీవల ఎవరికి ఫోన్ చేద్దామన్నా కాలర్ ట్యూన్ కంటే ముందు వస్తున్న ప్రభుత్వ యాడ్ ఇది. ఈ యాడ్ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ను ప్రజలకు అందిస్తున్నారు. అయితే అర్జెంట్ గా ఫోన్ చేయాల్సిన టైమ్ లో ఇలాంటి యాడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి కదా.. అలాంటప్పుడు ఈ యాడ్ ని రాకుండా చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సొసైటీలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకులు, పోలీసులు, వివిధ కంపెనీల పేర్లు చెప్పి మంచిగా మాట్లాడి అకౌంట్లలో డబ్బులన్నీ దోచేస్తున్నారు.

ఒక్కోసారి సిమ్ కనెక్షన్ తొలగిస్తామని భయపెట్టి బ్యాంకు అకౌంట్ డీటైల్స్ తీసుకుంటున్నారు. తీసుకున్న నిమిషాల్లోనే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అప్ డేట్ అయిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇవే కాకుండా వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫాం ల ద్వారా ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి తిరిగి సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తామని బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడి ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మరికొందరు సెక్సువల్ హరాస్మెంట్స్ కి కూడా గురవుతున్నారు. ఇలాంటి మోసాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికే టెలికాం కంపెనీలు ఫోన్ రింగ్ అవ్వడానికి ముందుగా సైబర్ మోసాలను వివరిస్తూ యాడ్ వినిపిస్తున్నాయి.

how to stop cyber security caller tune

నిజానికి ఈ సమాచారం చాలా విలువైనది. అయితే అత్యవసరంగా ఎవరికైనా కాల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ యాడ్ వస్తే ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ యాడ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే ఫోన్ రింగ్ అవడం ప్రారంభమవుతుంది. అంటే సుమారు 20 సెకన్లు మీరు ఓపిగ్గా యాడ్ మొత్తం వినాల్సి ఉంటుంది. మామూలు టైమ్ లో అయితే ఫ‌ర్లేదు కాని అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ యాడ్ పదే పదే వస్తోంది. ఇది ఒకరకంగా ఇబ్బంది పెట్టే విషయం. అందువల్ల మీరు ఈ యాడ్ ను కట్ చేయాలి అనుకుంటే ఈ చిన్న టెక్నిక్ ను ఫాలో అవ్వండి. ఈజీగా యాడ్ ఆగిపోతుంది.

ఈ సారి మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు లేదా తెలియని సమూహాల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా? వాళ్లు సైబర్ నేరగాళ్లు కావొచ్చు.. అంటూ యాడ్ వస్తే వెంటనే ఫోన్ లో కీ ప్యాడ్ ఓపెన్ చేయండి. అందులో # కీపై క్లిక్ చేయండి. వెంటనే యాడ్ వాయిస్ ఆగిపోయి కాల్ రింగ్ అవడం ప్రారంభమవుతుంది. దీంతో వెంటనే మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఇలా ఈ యాడ్ రాకుండా ఆప‌వ‌చ్చు.

Tags: cyber security caller tune
Previous Post

ఆకుకూర‌ల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నారా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..

Next Post

నల్లమిరియాలు.. రోజుకు ఒక్క గింజ తింటే చాలు.. శరీరంలో అద్భుతమైన మార్పులు ఖాయం..!

Related Posts

పోష‌ణ‌

టిలాపియా ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!

July 3, 2025
వినోదం

బాలకృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?

July 3, 2025
వినోదం

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే !

July 3, 2025
ఆధ్యాత్మికం

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

July 3, 2025
హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

July 3, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

July 3, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.