information

క్రెడిట్ కార్డు గురించి ఈ విషయం మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..?

సాధారణంగా వ్యాలెట్ లో ఏది ఉన్నా లేకపోయినా డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి. మరి ఈ 2 కార్డులు ఏ విధంగా ఉపయోగపడతాయో కొంత మందికి తెలిసిన కొంతమందికి దీనిపై అవగాహన లేదు. మరి ఏంటో ఒక సారి చూద్దాం.. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నా మీ డబ్బు తీసుకోవడానికి ఉపయోగపడేది బెబిట్ కార్డు. దీన్నే ఏటీఎం కార్డ్ అంటారు. అలా కాకుండా మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయడానికి డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడేది క్రెడిట్ కార్డ్. మరి ఈ క్రెడిట్ కార్డుని ఎవరు తీసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు దీనికి అర్హులు.

వడ్డీ లేకుండా 45 నుంచి 55 రోజుల వరకు డబ్బులు వాడుకోవచ్చు.మనకు ఇష్టమైన వస్తువులను ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి షాపింగ్ సంస్థలలో ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే డిస్కౌంట్ లభిస్తుంది.అలాగే సిబిల్ స్కోర్ లేదా, క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. మనం ఏదైనా లోన్ అప్లై చేసుకుంటే సిబిల్ స్కోర్ చూసే లోన్ ఇస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్లు కరెక్ట్ గా కడితే ఈ సిబిల్ స్కోర్ బాగా పెరుగుతుంది.

if you are using credit card must know this

క్రెడిట్ బిల్లు సరైన సమయంలో కట్టకపోతే ఎక్కువ వడ్డీతో డబ్బు కట్టాల్సి ఉంటుంది.ఇదే క్రెడిట్ కార్డుకు ఉన్న ప్రధాన సమస్య నష్టం. దీనివల్ల సిబిల్ స్కోర్ కూడా పడిపోతుంది.

Admin

Recent Posts