మీ ఇంటి ముందున్న గోడలపై ఏవేవో రాతలున్నాయా? హా…ఏదో చిన్నపిల్లలు రాశారులే అని లైట్ తీసుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త ….ఆ పిచ్చి రాతలే మీ కొంప ముంచుతాయ్.!! రాత్రికి రాత్రే మీ ఇంట్లో దొంగతనం జరిగిపోతుంది.! అవును., సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సమాచారం ఇదే విషయాన్ని క్లియర్ గా చెబుతుంది. దానికి అనుగుణంగా ఓ 7 సింబల్స్ ను చూపిస్తూ….వాటి వెనుకున్న అర్థాన్ని విడమరిచి చెబుతుంది. దొంగతనానికి ముందు…దొంగలు తాము టార్గెట్ చేసిన ఇంటి ముందున్న గోడపై రాసే…రాతలు.!
1) TOO Risky: దొంగతనం చేయడానికి చాలా రిస్క్ ఉన్న ఇళ్లని దీని అర్థం. 2)Alaramed House. అలారమ్ , కరెంట్ ఫెన్సింగ్స్ ఉన్న ఇళ్లని దీని అర్థం. 3)Wealthy చాలా సంపద ఉన్న ఇళ్లని దీని అర్థం. 4)Volnerable Female. మహిళలు, వృద్దులు ఉండే ఇళ్లని వారిని గాయపరిచి సొత్తును దొంగలించవచ్చని సంకేతం. 5)Good Target. దొంగతనం చాలా సింపుల్ గా చేసే ఇళ్లని దీని సంకేతం.
6) Nothing Worth Stealing సంపద అంతగా లేని ఇళ్లని, దోచినా పెద్ద ప్రయోజనం లేని ఇళ్లని దీని అర్థం. 7)Previously Burgled గతంలోనే ఓ సారి దొంగతనం జరిగిన ఇళ్లని చెప్పడం కోసం ఈ సింబల్ ను వాడతారు.!
గమనిక: మీ ఇంటి ముందున్న గోడపై ఇటువంటి రాతలేమైనా ఉంటే…వెంటనే దగ్గర్లోని పోలీసులకు సమాచారాన్ని అందించండి.