గౌతమ బుద్దుని కాలం.? అనగానే.. క్రీ.పూ 563 నుండి 483 అనే సమాధానం వస్తుంది…కాకతీయుల కాలం..? అనగానే క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు అనే సమాధానం వస్తుంది. …ఇలా పర్టిక్యులర్ గా కాలాన్ని నిర్ణయించడానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే పదాలను వాడేవారు…. ప్రతిదానికి కొలమానంగా వీటినే ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం వీటి స్థానంలో కొత్త పదాలను ఉపయోగిస్తున్నారు. ఇక మీదట క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అవుట్ డేటెడ్ అన్నమాట.!
కొత్త పదాలేవి?; క్రీస్తు శకం స్థానంలో సామాన్య శకం. క్రీస్తు పూర్వం స్థానంలో సామాన్య శక పూర్వం. ఇంగ్లీష్ లో దీన్ని కామన్ ఎరా (Common Era) అని లేదా కరంట్ ఎరా (Current Era) అనీ అంటారు. గతంలో అయితే ఇంగ్లీష్ లో BC, AD అని వాడేవారు.
BC – Before Christ ఇప్పుడు ఆ స్థానంలో……. BCE ( Before Common Era ). AD – Anno Domini ఇప్పుడు ఆ స్థానంలో……. CE (Common Era ) గా వ్యవహరించాలి.
ఎందుకిలా..? కాలాన్ని నిర్ణయించడానికి క్రీస్తును ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉండడం కారణంగా మత తటస్థతే ప్రధాన లక్ష్యంగా ఈ మార్పు జరిగింది. దానికి తోడు క్రీస్తు బర్త్ డేట్ కూడా సరిగ్గా లేదని విమర్శలు సైతం ఉండడంతో…. కాలానికి మత సంబంధం లేకుండా సామన్యశకం అనే సాధారణ నామాన్ని ఫిక్స్ చేశారు.