information

Savings Account Deposit Rules : ఒక సేవింగ్స్ ఖాతాలో ఎంత డ‌బ్బు ఉంచ‌వ‌చ్చు..? ఇన్‌క‌మ్ ట్యాక్స్ రూల్స్ తెలుసా..?

Savings Account Deposit Rules : దేశంలో ఉన్న ఎవ‌రైనా స‌రే ఏ బ్యాంకులో అయినా స‌రే సేవింగ్స్ ఖాతాల‌ను తెర‌వ‌వ‌చ్చు. కొంద‌రు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాల‌ను తెరుస్తారు. ఇంకొంద‌రు ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంట్ల‌ను నిర్వ‌హిస్తారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు అయితే చార్జిలు కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. పొర‌పాటున మినిమం బ్యాలెన్స్ పెట్ట‌క‌పోయినా పెద్ద‌గా ఛార్జిల‌ను విధించ‌రు. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో దాదాపుగా అన్ని ర‌కాల చార్జిలు ఎక్కువ‌గానే ఉంటాయి.

ఇక ఇన్‌క‌మ్‌ట్యాక్స్ రూల్స్ విష‌యానికి వ‌స్తే ఒక వ్య‌క్తి ఎన్ని సేవింగ్స్ ఖాతాల‌ను అయినా క‌లిగి ఉండ‌వ‌చ్చు. అందుకు ప‌రిమితి అంటూ ఏమీ లేదు. మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసే కెపాసిటీ ఉంటే ఒకరు ఎన్ని సేవింగ్స్ అకౌంట్ల‌ను అయినా స‌రే ఓపెన్ చేయ‌వ‌చ్చు. అందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు అని ఏమీ రూల్స్ ఉండ‌వు. ఏ బ్యాంకులో అయినా ఎన్ని ఖాతాల‌ను అయినా తెర‌వ‌వ‌చ్చు. ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన ప‌నిలేదు.

Savings Account Deposit Rules how much money per account is okay

అకౌంట్‌లో ఎంత డ‌బ్బును క‌లిగి ఉండ‌వ‌చ్చు..?

అయితే సాధార‌ణంగా ఒక‌టి క‌న్నా ఎక్కువ సేవింగ్స్ ఖాతాల‌ను క‌లిగి ఉన్న‌వారికి ఎప్పుడూ ఒక సందేహం వ‌స్తుంటుంది. అది ఏమిటంటే.. ఒక సేవింగ్స్ ఖాతాలో ఎంత మొత్తంలో డ‌బ్బును క‌లిగి ఉండ‌వ‌చ్చు.. అని సందేహిస్తుంటారు. అయితే ఎవ‌రైనా త‌మ అకౌంట్ల‌లో ఎంత డ‌బ్బును అయినా స‌రే క‌లిగి ఉండ‌వ‌చ్చు. అందుకు లిమిట్ అంటూ ఏమీ లేదు. కానీ ఒక వ్య‌క్తి ఒక అకౌంట్‌లో ఒక ఏడాదిలో రూ.10 ల‌క్ష‌ల‌కు మించి న‌గ‌దును డిపాజిట్ చేస్తే మాత్రం ఆ విష‌యాన్ని బ్యాంకులు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి తెలియ‌జేస్తాయి.

ఈ క్ర‌మంలో స‌ద‌రు డిపార్ట్‌మెంట్ వారు మీకు నోటీసులు ఇస్తారు. ఆ ఆదాయం ఎలా వ‌చ్చిదో చెప్పాల్సి ఉంటుంది. అయితే మీరు చెప్పే స‌మాధానానికి వారు సంతృప్తి చెందితే ఫ‌ర్వాలేదు. లేదంటే మీకు పెనాల్టీ విధిస్తారు. అది చాలా భారీ ఎత్తున ఉంటుంది. మీకు ఆదాయం ఎలా వ‌చ్చిందో మీరు స‌రిగ్గా చెప్ప‌క‌పోతే మీకు వ‌చ్చిన ఆదాయంపై ఏకంగా వారు 60 శాతం మేర ప‌న్ను విధిస్తారు. దానిపై 25 శాతం స‌ర్‌చార్జి క‌ట్టాలి. మ‌రో 4 శాతం సెస్ కూడా వ‌సూలు చేస్తారు. క‌నుక బ్యాంకుల్లో రూ.10 ల‌క్ష‌ల‌కు మించి చేసే న‌గ‌దు లావాదేవీల‌పై ఎవ‌రైనా స‌రే జాగ్ర‌త్త‌గా ఉండాలి.

రూ.10 ల‌క్ష‌ల‌కు మించితే..?

ఇక ఈ నియ‌మం క్యాష్ డిపాజిట్ల‌కే కాదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యుచువ‌ల్ ఫండ్ పెట్టుడులు, బాండ్స్‌, షేర్ల పెట్టుబ‌డులకు కూడా వ‌ర్తిస్తుంది. అంటే వీటిల్లో కూడా మీరు ఒక ఏడాదిలో రూ.10 ల‌క్ష‌ల‌కు మించి పెట్టుబ‌డి పెడితే ఆ విష‌యాన్ని స‌ద‌రు కంపెనీ వారు సీబీడీటీకి తెలియ‌జేస్తారు. అప్పుడు కూడా మీకు పైన చెప్పిన విధంగా నోటీసులు వ‌స్తాయి. క‌నుక ఏ విష‌యంలో అయినా మీరు చేసే రూ.10 ల‌క్ష‌ల‌కు మించి లావాదేవీల‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

ఇక మీకు సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీ ఏడాదికి రూ.10వేల లోపు ఉంటే మీరు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన ప‌నిలేదు. ఒక వేళ వ‌డ్డీలో టీడీఎస్ క‌ట్ చేసినా మీకు రూ.10వేల లోపు వ‌డ్డీ వ‌స్తే అప్పుడు మీరు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80టిటిఎ ప్ర‌కారం మిన‌హాయింపు తీసుకోవ‌చ్చు. దీంతో మీరు ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసిన‌ప్పుడు స‌ద‌రు టీడీసీ క‌ట్ అయిన మొత్తాన్ని మ‌ళ్లీ వెన‌క్కి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. దీంతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ వారు క‌ట్ చేసిన టీడీఎస్ మొత్తాన్ని రీఫండ్ ఇస్తారు. అయితే మీకు వ‌చ్చే వ‌డ్డీ విలువ ఏడాదికి రూ.10వేల క‌న్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు ప‌న్ను చెల్లించాల్సిందే. కానీ 60 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్రం ఈ విష‌యంలో రూ.50వేల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది. అంటే వారికి సేవింగ్స్ ఖాతా లేదా ఎఫ్‌డీల మీద ఏడాదికి వ‌చ్చే వ‌డ్డీ రూ.50వేలు అంత‌క‌న్నా త‌క్కువ ఉంటే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన ప‌నిలేదు. కానీ రూ.50వేల‌కు మించితే మాత్రం వారు కూడా ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

Admin

Recent Posts