సహజంగా రైలు సీట్ రిజర్వ్ చేసేటప్పుడు మీరు ఎంచుకున్న తరగతిని బట్టి మీకు బెర్త్ కిటికీ పక్కన, మధ్యలో లేక దారి పక్కన అనే ఎంపికలను ఇస్తుంది. కానీ ఈ ఎంపిక ఏ రైలు పెట్టెలోనో మీరు ఎంచుకోలేరు. ఎందుకంటే రైలు ప్రయాణిస్తున్నప్పుడు మీకు రైలు వేగం అలాగే రైలు కదలిక (వంపులు) మొదలుగున్నవి రైలు పక్కలకు ఊగటానికి అలాగే బ్రేకింగ్ ఫోర్స్ అంటే రైలు వేగాన్ని నియంత్రించే శక్తిని ప్రభావితం చేస్తాయి.
ఒక పెట్టెలో ఎక్కువ మంది మరొక పెట్టెలో తక్కువ ఉన్నప్పుడు పైన చెప్పిన ఇబ్బందులు కలుగుతాయి. ఆ కారణం చేత రైలు టికెట్ ఎంపికచేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఒక క్రమ పద్ధతిలో ప్రయాణికులను నిపుతుంది (ఎక్కి దిగే స్థానం, ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు మొదలగున్నవి). ఇది కనుక మన కుటుంబసభ్యులకు ఇబ్బంది అయిన ఎడల అన్ని సీట్లు ఒకే రైలు పెట్టే లో వచ్చిన యెడల మాత్రమే టికెట్ ను నింపవలెను అని ఎంపికను ఎంచుకోండి. అప్పుడు మీకు అన్ని సీట్లు ఒకే రైలు పెట్టే లో నింపబడతాయి.
కానీ ఇందులో ఒక్కో సారి సాధ్యపడక పోయినచో మొత్తానికే టిక్కెట్లు నింపబడక పోవచ్చును. ఇంకా చెప్పాలంటే జనరల్ బోగీలు మధ్యలో ఉండక పోవటానికి ఇది కూడా ఒక కారణం, ఎందుకంటే జనరల్ బోగీల్లో ఎంతమంది ఎక్కుతారో చెప్పలేం అలాగే ఖాళీగా కూడా ఉండొచ్చు.