Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home information

పెళ్లి తర్వాత భార్య తన ఇంటి పేరును కొనసాగించవచ్చా…? అలా చేస్తే ఏం జరుగుతుంది..!

Admin by Admin
January 24, 2025
in information, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అమ్మాయి పెళ్లి అయ్యాక, అత్తారింటికి వెళ్లి అక్కడ వారితో కలిసిపోతుంది. పెళ్లయిన తర్వాత మహిళ భర్తతో కలిసి సాగుతుంది. వారి కుటుంబంలో భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. మన సమాజంలో ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. కానీ, చట్ట ప్రకారం పెళ్లయిన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు.

రాజ్యాంగం ప్రకారం అది పూర్తిగా వారి ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగాలన్నది వ్యక్తుల ఇష్టం. అయితే పేరు మార్చుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. వివాహిత తనకు పెళ్లికాకముందు ఉన్న ఇంటి పేరుని (మేయిడెన్ నేమ్) కొనసాగించుకోవచ్చు. పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండోది. మన దేశంలో అధిక శాతం మంది అనుసరించే విధానం ఇది.

will women have to change their name after marriage

పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు మార్చుకోకుండానే, భర్త పేరును కూడా చేర్చుకోవడం మరో విధానం. ఉదాహరణకు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన తర్వాత తన పూర్తి పేరు చివర్లో బచ్చన్ ను చేర్చుకుంది. సమస్యలు రాకుండా ఉండాలంటే, పెళ్లి కాక ముందున్న పేరుతోనే పెళ్లయిన స్త్రీ కొనసాగితే, భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబపరమైన వివాదాలు తలెత్తితే అటువంటి సమస్యలు ఏర్పడతాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు ఉదయిస్తాయి.

ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలు తలెత్తిన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లి అయిన మహిళ తన ఇంటిపేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని కొందరు సూచిస్తుంటారు. ఒకవేళ పేరు మార్చుకున్నట్టే అయితే, ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేయించుకోవాలి. రెండు, మూడు ఆప్షన్లలో ఏదైనా ఆ మేరకు కీలక డాక్యుమెంట్లలో పేర్లను కూడా మార్చుకోవాలి. దాంతో ఆర్థిక, ఆస్తి లావాదేవీల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు నిపుణులు. భర్త ఇంటి పేరు నువ్వు స్వీకరిస్తే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటిలో ఆమెకు మార్చుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలోని పేరు మార్చుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు కీలకం బ్యాంకు ఖాతా. ఇక మ్యూచువల్ ఫండ్స్, డిమ్యాట్ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిల్లో పేర్ల మార్పు కోసం అఫిడ‌విట్‌ జిరాక్స్ కాపీ లేదా వివాహ నమోదు దృవీకరణ పత్రం కాపీలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఇతరాత్ర ఎక్కడెక్కడ పేరు మార్చుకోవాలన్నది మీకున్న వ్యవహారాలను బట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే, సంబంధిత కార్యాలయంలోని రికార్డుల్లోనూ మార్పులు చేసుకోవడం తప్పనిసరి అని మర్చిపోవద్దు.

Tags: Marriagenamewomen
Previous Post

Udayabhanu : ఉద‌య భానుని తొక్కేశారా.. ఆ అవ‌స‌రం ఎవ‌రికి ఉంది..?

Next Post

నెగిటివ్ టాక్ వచ్చి సూపర్ హిట్టైన 15 టాలీవుడ్ సినిమాలు..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!