Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ఆత్మ విశ్వాసం ఉంటే ఏ ప‌ని అయినా చేయ‌వ‌చ్చు.. చిన్న క‌థ‌..!

Admin by Admin
June 19, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఓ వ్యాపారవేత్త వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల పాలయ్యాడు. అందులో నుంచి బయటపడటానికి ఎలాంటి మార్గమూ కన్పించలేదు. అతనికి అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని వేధించడం మొదలుపెట్టారు. అతనికి వస్తువులు సరఫరా చేసిన వాళ్లు డబ్బులు చెల్లించమని రోజూ ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఓ రోజు ఉదయం పార్క్‌కి వచ్చి తల పట్టుకు కూర్చున్నాడు. తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. అతని వయసు 70 సంవత్సరాలు ఉండవచ్చు. వ్యాపారవేత్త ఏదో బాధలో వున్నట్టు అతను గమనించాడు. చాలా బాధలో వున్నట్టున్నావు? ప్రశ్నించాడు. వ్యాపారవేత్త తన పరిస్థితిని వివరించాడు. నీకు నేను సహాయం చెయ్యగలను చెప్పాడు ఆ వ్యక్తి.

వ్యాపారవేత్త పేరు అడిగి తెలుసుకొని పది లక్షలకి చెక్ రాసి అతనికిచ్చి ఇట్లా అన్నాడు. ఈ డబ్బు అవసరమైతే వాడుకో. సరిగ్గా సంవత్సరం తరువాత ఇక్కడే కలుద్దాం. అప్పుడు ఆ డబ్బు నాకు తిరిగి ఇచ్చేద్దువు. వ్యాపారవేత్త ఆలోచించేలోపే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు. దేవుడే అతడిని పంపించాడని అనుకున్నాడు. ఆ వ్యక్తి సంతకాన్ని చూస్తే అతని పేరు సుబ్బరామిరెడ్డి అని ఉంది. ఈ డబ్బుతో నా బాధలు తొలగిపోతాయని ఆ వ్యాపారవేత్త అనుకున్నాడు. కానీ ఆ చెక్కును అప్పుడే వాడుకోదల్చుకోలేదు. తన ఐరన్ సేఫ్‌లో భద్రపరిచి తన వ్యాపారాన్ని తిరిగి సమర్థవంతంగా కొనసాగించడం మొదలుపెట్టాడు. ఆ చెక్కు అతనికి కొండంత బలం ఇచ్చింది. అంతగా అవసరమైతే చెక్కును వాడుదామని అనుకున్నాడు.

self confidence gives anything to work with

చాలా ఆశావహంగా తన వ్యాపారాన్ని కొనసాగించాడు. తన బాకీదారులని, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు చెల్లిస్తానన్న నమ్మకం కలిగించాడు. కొన్ని నెలలు గడిచాయి. అతని వ్యాపారం అభివృద్ధి చెందింది. అప్పుల బాధ నుంచి అతను బయటపడ్డాడు. సరిగ్గా సంవత్సరం తరువాత అతను మళ్లీ పార్క్‌కి వచ్చి ఆ చెక్కు ఇచ్చిన వ్యక్తి కలిసిన ప్రదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తి అక్కడ కన్పించాడు. ఆ చెక్కుని అతని చేతిలో పెట్టి తాను ఎలా వ్యాపారంలో అభివృద్ధి చెందానో అతనికి చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఓ నర్సు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంది. అమ్మయ్యా! ఇతన్ని పట్టుకున్నాను అరిచింది ఆ నర్సు. ఇతను నిన్ను విసిగిస్తున్నాడా! ఎప్పుడూ ఇంటి నుంచి పారిపోయి వస్తుంటాడు. ఇతనికి మతిస్థిమితం లేదు. ఇతని బాగోగులు నేను చూస్తుంటాను. ఎప్పుడూ ఈ పార్క్‌కే వస్తూ ఉంటాడు. రెండు సంవత్సరాలుగా ఇదే పని. ఎవరినీ ఏమీ అనడు అని చెప్పి అతన్ని తీసుకొని నర్స్ వెళ్లిపోయింది.

వ్యాపారవేత్త ఆశ్చర్యానికి లోనయినాడు. కొయ్యబారిపోయాడు. సంవత్సరంపాటు తన దగ్గర పది లక్షల రూపాయలు ఉన్నాయన్న ధైర్యంతో అప్పుల వాళ్లని, కస్టమర్లని, తనకు వస్తువులు సరఫరా చేసిన వ్యక్తులని సమర్థవంతంగా ఎదుర్కొన్నాను. వాళ్లని ఒప్పించగలిగాను. కష్టాల నుంచి బయట పడగలిగాను. కొద్దిసేపటికే అతనికి అర్థమైంది. తనను సమర్థవంతంగా ముందుకు నడిపించింది డబ్బు కాదు. తనలో ఏర్పడ్డ ఆత్మవిశ్వాసం. సాధించాలన్న కాంక్ష.

Tags: self confidence
Previous Post

ఫేస్‌బుక్‌లో ఈ తరహా పోస్టులను అస్సలు షేర్‌ చేయకండి. చేసినా డిలీట్‌ చేయండి..!

Next Post

ఏం చేద్దామ‌న్నా టైం ఉండ‌డం లేద‌ని భావించేవారు.. ఇది చ‌ద‌వండి..

Related Posts

mythology

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

July 8, 2025
ఆధ్యాత్మికం

బ్ర‌హ్మ రాసిన త‌ల‌రాత‌ను మార్చుకునే వీలుందా..? పురాణాలు ఏం చెబుతున్నాయి..?

July 8, 2025
ఆధ్యాత్మికం

క‌ల‌లో మీకు ఆరిపోయిన దీపం క‌నిపిస్తుందా.. దాని అర్థం ఏమిటంటే..?

July 8, 2025
వినోదం

నటనలోనే కాదు డాన్సుల్లోనూ ఒక ఊపు ఊపేసిన 10 మంది స్టార్ హీరోయిన్స్

July 8, 2025
వినోదం

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే..!!

July 8, 2025
వినోదం

పనికిరారు అన్నవారికి బుద్ధి చెప్పి హీరోలుగా మారిన స్టార్లు…!

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.