మనం ఆనంద పడే ముందు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు. బ్రిటిష్ వారి F35 విమానం ఘటన గురించి. మొదటిది – భారత వాయుసేన తెలిపింది ఏమనగా, మన Integrated Air command and control system , 5th gen విమానాన్ని పసిగట్టింది అని, అలాగే దానికి అవసరమైన సహకారం అందిస్తున్నాం అని. ఐతే, ఈ విషయం లో కొన్ని వార్తా సంస్థలు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉత్సాహం చూపించి, ముఖ్యమైన విషయం మరిచిపోతున్నాయి. అది ఇక్కడ తెలియజేస్తాను. F 35 విమానం యుద్ద వాతావరణం లో లేనప్పుడు, ట్రైనింగ్ లో ఉన్నప్పుడు, సాధారణం గా ఎగురుతున్నపుడు Luneburg lens ని install చేసుకుని ప్రయాణిస్తాయి. ఇది ఉద్దేశపూర్వకం గా సాధారణ రాడర్లకు కూడా ఈ విమానం బాగా కనిపించేలా తరంగాలను వెదజల్లుతాయి.
పౌర విమానయాన రాడార్ లకు కూడా ( మిలిటరీ రాడార్ దాకా అక్కర్లేదు) స్పష్టం గా కనబడటం వల్ల ఐడెంటిఫికేషన్ విషయం లో అప్రార్ధాలు తలెత్తకుండా ఉండటం కోసం ఈ పని చేస్తారు అన్న విషయం గుర్తు ఉంచుకోవాలి. ఇది తెలియకుండా, 5th gen fighter ని మనం తేలికగా పసిగట్టేసాం అంటూ పెద్ద background సౌండ్ తో program లు వేసేస్తున్నారు. నిజమైన యుద్ధం లో ఆ lens తీసేస్తారు, ఆయుధాలు ఇంటర్నల్ bay లో దాచేస్తారు, ప్రత్యేకమైన రాడార్ absorbent coating వేసుకుని low observable configuration లో వస్తాయి. అప్పుడు లెక్కలు అన్ని మారిపోయాయి. అప్పుడు మనం దాన్ని చూడగలమా? అది వేరే చర్చ. మరీ… ఆ విమానాన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు అని మాత్రమే ప్రతిపాదన.
రెండవది – ఈ విమానం మన మీద నిఘా వేయడానికి రాలేదు, అక్రమం గా కూడా ప్రవేశించలేదు. ఈ మధ్యే మనం HMS prince of wales carrier group తో మన భారత నావికాదళం exercise పూర్తి చేసుకుంది, ఆ carrier మీద ఉన్న విమానమే ఇది. ఆ carrier ఇంకా హిందూ మహా సముద్రం లోనే ఉంది. ఈ విమానం భారత Air defense identification zone బయట ఎగురుతుంది. ముందు జాగ్రత్త చర్యగా దాని రూట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి airport లను designate చేస్తారు. అలా, దానికి తిరువనంతపురం , emergency recovery airfield గా కేటాయించబడింది ( మన సహకారం లో భాగం గా ). ఇబ్బంది రాగానే, protocol ప్రకారం వారు, మనం నడుచుకున్నాము.