15th December : Pakistan ఆర్మీ, బంగ్లాదేశ్ లో లోంగి పోవడానికి ఒక్క రోజు ముందు…. అమెరికా వారి 7th fleet, Task force 74 బంగాళాఖాతం లోకి ప్రవేశించింది. Nuclear powered aircraft carrier USS Enterprise , 1 assualt ship, 3 destroyers, 3 guided missile boats, 1 nuclear submarine, 1 supply ship తో దాడికి సిద్దం అవుతుంది. బ్రిటిష్ వారి Royal Navy కూడా అరేబియా సముద్రం నుంచి మనల్ని చుట్టుముట్టి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తో కదులుతుంది.
నిజం చెప్పాలి అంటే, వారిని ఎదుర్కునే సామర్ధ్యం ఇంకా భారత్ దగ్గర లేదు అప్పుడు. Soviet union తన పసిఫిక్ ఫ్లీట్ లోని 10th operative battle group ని submarines, destroyers భారత్ కి సహాయం గా కదిలింది. అమెరికా, బ్రిటన్ వెనుకడుగు వేశాయి. భారత్, పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి వారు లొంగిపోయి, కొత్త దేశం ఏర్పడేలా చేసింది. ఆ నాడు రష్యా సహాయం చేసి వుండకపోతే? అందరూ మూకుమ్మడిగా భారత్ మీద పడివుంటే?
అలాగే, ఎవ్వరూ మనకి యుద్ద విమానాలను ఇవ్వడానికి నిరాకరించారు. రష్యా ఇచ్చింది. UN SECURITY COUNCIL లో మనకి అండగా నిలబడింది. అరిహంత్ nuclear submarine engine తయారు చేసుకోవడానికి సహాయపడింది. ఇతరులు నిరాకరించారు. ఇదంతా గతం, ప్రస్తుతం వున్నది ఆనాటి సోవియట్ యూనియన్ కాదు, రష్యా కి పూర్వ బలం ఇప్పుడు లేదు. చైనా మీద ఆధారపడి వుంది. ప్రస్తుత సందర్భం లో వారి స్పందన భిన్నంగా వుండవచ్చు. గతం విషయంలో కృతజ్ఞత ప్రస్తుతం మాత్రం వాస్తవంలో వుండటం అవసరం.